చికెన్ మిరియాలరసం ఇలా చేస్తే మాములుగా ఉండదు!

వర్షాకాలంలో జలుబు, దగ్గు వంటివి సాధారణంగా వస్తూ ఉంటాయి. అయితే వీటికి మిరియాలు చాలా చక్కని సహజ ఔషధంగా పనిచేస్తాయి. ఎక్కువగా మిరియాల చారు పెట్టుకుని తాగితే వీటి నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ మిరియాల రసానికి తోడు చికెన్ కూడా ఉంటే మన శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. అందుకే చికెన్ తో కలిపి చేసే మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలి? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

చికెన్ - అరకిలో
నూనె- మూడు టేబుల్ స్పూన్లు
జీలకర్ర- రెండు టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి - 15 రెబ్బలు
కరివేపాకు- రెండు రెమ్మలు
పచ్చిమిరపకాయలు- 4
ఎండు మిరపకాయలు- మూడు
పసుపు- అర టీ స్పూన్
ఉప్పు- రుచికి సరిపడినంత
ధనియాలు-రెండు టీస్పూన్లు
నల్లమిరియాలు- రెండు స్పూన్లు
గరం మసాలా- ఒక టేబుల్ స్పూన్
చింతపండు రసం- నిమ్మకాయంత చింతపండు
టమాటాలు- మూడు
నీళ్లు- ఐదుకప్పులు
కొత్తిమీర- కొద్దిగా

Chicken miriyala Rasam Recipe for Cold amp amp Cough Relief in Monsoon know how to make it easy tasty

తయారీ విధానం

ముందుగా రెండు స్పూన్ల ధనియాలు, రెండు స్పూన్ల మిరియాలు, రెండు స్పూన్ల జీలకర్ర, కరివేపాకు రెండు రెమ్మలు కలిపి లైట్ గా స్టౌపైన వేయించి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఆపైన స్టవ్ పైన కడాయి పెట్టి నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత జీలకర్ర, దంచిన వెల్లుల్లి వేసి వేయించాలి. ఇందులోనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి దోరగా అయిన తర్వాత చికెన్ కూడా వేసి ఉడికించాలి.

చికెన్ మిరియాల సూప్ ఇలా చేస్తే టేస్టీ

చికెన్ లోని నీరంతా ఆవిరై పోయే వరకు చికెన్ ని ఉడికించిన తర్వాత, అప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్న మిరియాల పొడిని వేసి కలపాలి. ఆపై పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి బాగా చికెన్ కి పట్టేలా కలపాలి. ఆపై అందులో టమాటా ప్యూరీ వేసి పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి. కొద్దిగా చింతపండు రసం కూడా పోయాలి. అందులో దాదాపు 5 కప్పులనీరు పోసి నిదానంగా ఉడికించాలి.

దొండకాయ కొబ్బరి పచ్చడి.. తిన్నవాళ్ళు తప్పక మెచ్చుకుంటారు!
దొండకాయ కొబ్బరి పచ్చడి.. తిన్నవాళ్ళు తప్పక మెచ్చుకుంటారు!

వేడి వేడి అన్నంలో అయినా, సూప్ గా అయినా ఇది బెస్ట్

చివర్లో చికెన్ మిరియాల రసంలో కొత్తిమీర చల్లి దించాలి. వేడివేడిగా అన్నంతో కలిపి ఈ సూప్ ను తీసుకుంటే చాలా బాగుంటుంది. జలుబు, దగ్గు ఉన్నవారికి ఈ రసం తక్షణమే ఉపశమనాన్ని ఇస్తుంది. మరెందుకు ఆలస్యం చికెన్, మిరియాల రసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+