ఖాళీ కడుపుతో ఈ టీ తీసుకోండి చాలు- ఇప్పుడిదే ట్రెండింగ్

ఆయుర్వేద జీవన విధానంలోని విశిష్ట మూలిక.. అయిన బ్రాహ్మి. దీన్ని సరస్వతీ ఆకుగా పిలుస్తారు. దీంతో తయారు చేసే టీ ఈ మధ్యకాలంలో ట్రెండ్ లో ఉంటోంది. ఆధునిక ప్రపంచంలో ఎదురయ్యే మానసిక సమస్యలు, ఒత్తిళ్లను చిటికెలో నివారించే సామర్థ్యం ఉండటం ఈ టీ ప్రత్యేకత. ఫలితంగా.. ఆదరణను చూరగొంటోంది. ఆయుర్వేదంలో ఈ బ్రాహ్మి టీ కి మేధోశక్తిని పెంచే గొప్ప ఔషధంగా గుర్తింపు ఉంది. ఇప్పుడు హెర్బల్ టీ రూపంలో డీటాక్స్ కోసం విరివిగా ఉపయోగిస్తోన్నారు.

ఆయుర్వేదం ప్రకారం.. మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని దృఢంగా మార్చడంలోనూ ఈ బ్రాహ్మీ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. సరస్వతి ఆకులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీర రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడమే కాకుండా, హానికర ఫ్రీ రాడికల్స్ బారి నుంచి మెదడు కణాలను సురక్షితంగా కాపాడడంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఉదయం వేళ ఖాళీ కడుపుతో తీసుకున్నా మంచి ఫలితాలు దక్కుతాయి.

Brahmi Tea to Reduce Anxiety Stress and Calm Your Mind Improve Digestion and Soothe with Bloating

బ్రాహ్మి టీని నిత్యం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడులోని జ్ఞాపకశక్తికి సంబంధించిన నరాల కణాలు ఉత్తేజితమై చురుగ్గా పనిచేస్తాయి. ఇది ఆలోచనా శక్తిని పెంచడంతో పాటు ఏకాగ్రతను రెట్టింపు చేస్తుంది. మానసిక ఆందోళనలను పెంచే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను క్రమబద్ధీకరించడం ద్వారా తీవ్ర ఒత్తిడిని, శారీరక అలసటను నివారించి మనస్సుకు ప్రశాంతతను కల్పిస్తుంది. మానసిక ఉపశమనాన్ని చేకూరుస్తుంది.

మరోవైపు శారీరక ఆరోగ్య కోణంలో చూస్తే గనుక.. జీర్ణక్రియ సంబంధిత ఇబ్బందులను ఎదుర్కోవడంలో కూడా ఈ బ్రాహ్మి టీ చక్కగా తోడ్పడుతుంది. గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నయం చేసి జీర్ణనాళాన్ని పూర్తిగా ప్రశాంతపరుస్తుంది. ఇందులోని అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మ కణాలను సంరక్షించి వృద్ధాప్యపు ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకోగలుగుతుంది. జుట్టు కుదుళ్లను పటిష్టం కావడానికి సహాయపడుతుంది.

టాలీవుడ్ లో క్రేజీ ఫిల్మ్: పవర్ ఫుల్ టైటిల్: ఎప్పుడూ చేయని రోల్ లో యంగ్ హీరో
టాలీవుడ్ లో క్రేజీ ఫిల్మ్: పవర్ ఫుల్ టైటిల్: ఎప్పుడూ చేయని రోల్ లో యంగ్ హీరో

శ్వాసకోస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారికి ఊపిరితిత్తులలోని శ్లేష్మాన్ని తొలగించి సులభంగా గాలి పీల్చుకోవడానికి ఈ టీ సహాయపడుతుంది. గుండె పనితీరును మెరుగుపరిచి రక్త ప్రసరణను సులభతరం చేయడంలో కూడా బ్రాహ్మి ఆకుల్లో ఉండే క్రియాశీలక రసాయనాలు కీలక పాత్ర పోషిస్తాయి. దీనివల్ల ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా గుండె జబ్బుల ప్రమాదం సైతం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

బ్రాహ్మి టీలో ఔషధ గుణాలు ఉన్నప్పటికీ, దీనిని మోతాదుకు మించి తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తోన్నారు. మితిమీరి తీసుకోవడం వల్ల కొంతమందిలో వికారం, తలనొప్పి, కడుపులో అసౌకర్యం వంటి దుష్ప్రభావాలు వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది. ఇది సహజంగానే రక్తపోటును గణనీయంగా తగ్గిస్తుంది కాబట్టి లో-బీపీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. గర్భిణీలు, బాలింతలు ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే దీనిని వాడటం సురక్షితం.

అది మా రక్తంలోనే ఉంది: భరతమాత నొసటిన తిలకం: నిండు సభలో తేల్చి చెప్పిన విజయ్
అది మా రక్తంలోనే ఉంది: భరతమాత నొసటిన తిలకం: నిండు సభలో తేల్చి చెప్పిన విజయ్

కృత్రిమ రసాయనాలు లేదా కేఫిన్ అధికంగా ఉండే కాఫీ, టీలకు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యకరమైన పానీయం తాగాలని ఆకాంక్షించే వారికి ఈ హెర్బల్ టీ ఒక వరప్రసాదం లాంటిది. దీని స్వల్ప చేదు, మట్టి వాసనతో కూడిన రుచి శరీరానికి చలవను కలిగిస్తుంది. ఈ బ్రాహ్మి టీ ని తమ దినచర్యల్లో ఒకటిగా చేసుకోవడం వల్ల మెరుగైన శారీరక ఆరోగ్యాన్ని, ప్రశాంతమైన జీవనాన్ని సొంతం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+