పాఠశాలలకు దసరా సెలవులు ఖరారు - ఏపీ, తెలంగాణలో ఇలా..!!

విద్యార్థులకు గుడ్ న్యూస్. వచ్చే నెల ఏకంగా 13 రోజులు వరుస సెలవులు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా భావించే దసరా సెలవుల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెలవుల క్యాలెండర్ ను ప్రకటించారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏపీతో పాటుగా తెలంగాణలోని పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు దసరా సెలువు వస్తున్నాయి. అక్టోబర్ 23న తిరిగి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

విద్యార్ధులకు దసరా సెలవుల పైన స్పష్టత వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సెలవుల తో పాటుగా పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది. ఏపీలోనూ దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు దసరా సెలువు వస్తున్నాయి. ఈ ఏడాది దసరా అక్టోబర్ 20వ తేదీ మంగళవారం జరగనుంది. దసరా వేళ తెలుగు రాష్ట్రాల్లో నవరాత్రి వేడుకలు, తెలంగాణలో బతుకమ్మ సంబురాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పండగకు కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊర్లకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగులు ముందుగానే ప్రయాణ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ఈ సమయంలో సెలవుల పైన విద్యా శాఖ స్పష్టత ఇచ్చింది. అక్టోబర్ 9 చివరి పనిదినం ఉంటుంది. సెలవుల తర్వాత అక్టోబర్ 23న స్కూల్లు తిరిగి ప్రారంభం అవుతాయి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూల్లకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ షెడ్యూల్ అమలు చేయాల్సి ఉంటుంది.

 శ్రీవారి భక్తులకు స్కైవాక్ బ్రిడ్జి, కొత్త యాప్ : శ్రీవారి సేవకులు ఇక - చంద్రబాబు..!!
శ్రీవారి భక్తులకు స్కైవాక్ బ్రిడ్జి, కొత్త యాప్ : శ్రీవారి సేవకులు ఇక - చంద్రబాబు..!!
education-department-officials-declared-dasara-holidays-for-13-days-in-both-telugu-states-here-the

ఏకంగా 13 రోజుల సెలవులు

కాగా, ఏపీలోని ప్రముఖ ఆలయాల్లో దసరా నవరాత్రి ఉత్సవాల షెడ్యూల్ ప్రకటించారు. తిరుమల లో బ్రహ్మోత్సవాలు.. ఇంద్రకీలాద్రి పైనా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. అదే విధం గా తెలంగాణ లో అక్టోబర్ 11 నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి. సద్దుల బతుకమ్మ ప్రధాన వేడుక అక్టోబర్ 19వ తేదీన జరుగుతుంది. దసరా సెలవులు వరుసగా 13 రోజులు రావడంతో హైదరాబాద, ఇతర పట్టణాలు, నగరాల్లో చదువుతున్న విద్యార్థులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సమయం లభిస్తుంది. దసరా సెలవులకు ముందే విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్-1 (SA-1) పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+