Asian Games 2026: నేటి నుంచే ఆసియా గేమ్స్ హంగామా.. పూర్తి షెడ్యూల్, టైమింగ్స్ ఇదిగో!

Asian Games 2026: ఆసియా ఖండంలోనే అతిపెద్ద క్రీడా సంబరం 'ఆసియా క్రీడలు 2026' జపాన్‌లో ప్రారంభం కానున్నాయి. జపాన్‌లోని ఐచి-నగోయాలో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఈ ఆసియా క్రీడలు జరగనుండగా.. ప్రధాన ప్రారంభోత్సవ వేడుకకు ముందే సెప్టెంబర్ 17 నుంచే భారత్ తన క్రీడా ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్ తరఫున వివిధ క్రీడలలో పతకాలు సాధించేందుకు మొత్తం 503 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు.

దావూద్‌తో వైరల్ ఫోటో.. ఏళ్ల తర్వాత నోరు విప్పిన మందాకిని! అసలు నిజం ఇదే!!
దావూద్‌తో వైరల్ ఫోటో.. ఏళ్ల తర్వాత నోరు విప్పిన మందాకిని! అసలు నిజం ఇదే!!

భారత మ్యాచ్ వేళలు, ప్రత్యక్ష ప్రసార వివరాలు
జపాన్‌తో భారత్‌కు ఉన్న సమయ వ్యత్యాసం కారణంగా మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం ఉదయాన్నే ప్రారంభం కానున్నాయి. అనేక ఈవెంట్లు ఉదయం 5.30, 6, 7.30 గంటలకు మొదలవుతాయి. భారత క్రీడాభిమానులు ఈ పోటీలను ప్రత్యేక్షం వీక్షించడానికి లైవ్ టెలికాస్ట్ హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ దక్కించుకుంది. అలాగే డిజిటల్ వినియోగదారులు 'సోనీలివ్' యాప్, వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌ను చూడవచ్చు.

Asian Games 2026 Full Schedule Timings Venues and Live Streaming Details on Sony Sports and SonyLIV

ప్రధాన క్రీడలు, పూర్తి షెడ్యూల్ వివరాలు

క్రికెట్
మహిళల క్రికెట్ టోర్నీ సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు జరుగుతుంది. పురుషుల క్రికెట్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహించబడుతుంది. భారత పురుష, మహిళా జట్లు నేరుగా క్వార్టర్-ఫైనల్ దశ నుంచే బరిలోకి దిగుతాయి. ఈ మ్యాచ్‌లు కోరోగి అథ్లెటిక్ పార్కులో ఉదయం 5.30 నుంచి 10.30 గంటలకు ప్రారంభమవుతాయి.

బ్యాడ్మింటన్
ఇచిమినోయా నగర మున్సిపల్ వ్యాయామశాలలో సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. సెప్టెంబర్ 20-24 వరకు పురుషుల, మహిళల టీమ్ ఈవెంట్లు.. ఆ తర్వాత సెప్టెంబర్ 25-29 వరకు సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ నాకౌట్, మెడల్ రౌండ్లు ఉంటాయి.

హాకీ
గిఫు ప్రిఫెక్చురల్ గ్రీన్ స్టేడియంలో సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 3 వరకు భారత పురుషులు, మహిళల జట్లు పూల్ మ్యాచ్‌లతో పాటు సెమీ-ఫైనల్స్, ఫైనల్ రౌండ్లలో పోటీపడతాయి.

డబ్బుల కోసమే ఇదంతా.. అసదుద్దీన్ ఒవైసీ సంచలనం!
డబ్బుల కోసమే ఇదంతా.. అసదుద్దీన్ ఒవైసీ సంచలనం!

అథ్లెటిక్స్
సెప్టెంబర్ 24 నుంచి 29 వరకు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లు జరగనున్నాయి. ఇందులో స్ప్రింట్స్, హర్డిల్స్, రిలేలు, మారథాన్, త్రోస్, జంప్స్ వంటి కీలక పతక ఈవెంట్లు ఉంటాయి.

షూటింగ్, బాక్సింగ్
షూటింగ్ పోటీలు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 1 వరకు ఐచి ప్రిఫెక్చురల్ జనరల్ షూటింగ్, గ్యాలరీలో జరగనుండగా.. బాక్సింగ్ పోటీలు నిషియో జిమ్నాసియంలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తారు.

రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్
వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనుండగా.. ఇందులో మీరాబాయి చాను వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. రెజ్లింగ్ పోటీలు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు నగోయా సిటీ అనే స్పోర్ట్స్ సెంటర్ వేదికగా జరగనున్నాయి.

కబడ్డీ షెడ్యూల్
తేదీలు: సెప్టెంబర్ 21 నుండి 26 వరకు

వేదిక: టోకై సిటిజన్ జిమ్నాసియం

సమయాలు: ఉదయం 6:00 గంటలకు, మధ్యాహ్నం 12:30 గంటలకు, 2:30 గంటలకు (IST)

పోటీ: పురుషుల, మహిళల గ్రూప్ మ్యాచ్‌ల తర్వాత, అర్హతను బట్టి సెమీ-ఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయి.

ఇతర క్రీడలు, వేదికలు
ఈ ప్రధాన క్రీడలతో పాటు టేబుల్ టెన్నిస్(సెప్టెంబర్ 26-30), ఆర్చరీ(సెప్టెంబర్ 23-అక్టోబర్ 3), టెన్నిస్(సెప్టెంబర్ 23-అక్టోబర్ 1), స్విమ్మింగ్(సెప్టెంబర్ 20-25), ఈస్పోర్ట్స్(సెప్టెంబర్ 23 - అక్టోబర్ 2) పోటీలు కూడా వైభవంగా జరగనున్నాయి.

ప్రారంభ, ముగింపు వేడుకలు
ఆసియా క్రీడల అధికారిక ప్రారంభోత్సవం సెప్టెంబర్ 19న మధ్యాహ్నం 2.30 గంటలకు నగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో అత్యంత ఘనంగా జరగనుంది. అదే వేదికపై అక్టోబర్ 4న మధ్యాహ్నం 3.30 గంటలకు ముగింపు వేడుకతో ఈ క్రీడా సంబరం ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+