దావూద్‌తో వైరల్ ఫోటో.. ఏళ్ల తర్వాత నోరు విప్పిన మందాకిని! అసలు నిజం ఇదే!!

బాలీవుడ్ అలనాటి అందాల నటి మందాకిని తన కెరీర్‌లో అత్యంత సంచలనం సృష్టించిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఉన్న వైరల్ ఫోటో వివాదంపై ఎట్టకేలకు స్పందించారు. కొన్నేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన ఓ ఫోటోపై ఏఎన్ఐ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ రోజు జరిగిన పరిస్థితులను మందాకిని గుర్తు చేసుకున్నారు.

అల్లు అర్జున్ 'రాకా' ఫస్ట్ గ్లింప్స్ కు ముహూర్తం ఫిక్స్..!
అల్లు అర్జున్ 'రాకా' ఫస్ట్ గ్లింప్స్ కు ముహూర్తం ఫిక్స్..!

మందాకిని ఈ విషయంపై మాట్లాడుతూ.. "జనాలు ఏం రాయాలనుకున్నా, ఏం చెప్పాలనుకున్నా దానిపై మనకు ఎలాంటి నియంత్రణ ఉండదు. ఓ ఆర్టిస్టుగా మమ్మల్ని వేలాది మంది కలుస్తారు. మాకు అందరూ సమానమే. నేను క్రికెట్ మ్యాచ్ చూసేందుకు దుబాయ్ వెళ్లలేదు. మేము ఓ స్టేజ్ షో కోసం అక్కడకు వెళ్లాం. ఆ మ్యాచ్‌లో చాలా మంది కూర్చున్నారు. దావూద్ కూడా అక్కడే కూర్చుని ఉన్నాడు" అని మందాకిని స్పష్టం చేశారు.

Veteran Actor Mandakini Breaks Silence on Viral Photo With Dawood Ibrahim Know the Truth Here

దావూద్ తనను ప్రత్యేకంగా ఆహ్వానించలేదని మందాకిని వెల్లడించారు. ఓ అంశాన్ని వివాదాస్పదం చేయడం లేదా దానికి ఆసక్తికరమైన రంగు పులమడం ఆ రోజుల్లో తనకు తెలియదని మందాకిని తెలిపారు. ఈ వివాదం తన కెరీర్‌కు, వ్యక్తిగత జీవితానికి చాలా పెద్ద నష్టం కలిగించిందని.. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించడాని ఒక టీమ్ ఎంత అవసరమో ఆ తర్వాతే తనకు అర్థమైందని మందాకిని ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీహరి తనయుడు హీరోగా సాలిడ్ థ్రిల్లర్- టీజర్ విడుదల
శ్రీహరి తనయుడు హీరోగా సాలిడ్ థ్రిల్లర్- టీజర్ విడుదల

అప్పట్లోనే తాను ఈ పుకార్లను పూర్తిగా ఖండించానని, ఆ వార్తలు మీడియాలో కూడా ప్రచురితమయ్యాయని నటి గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా 1980ల కాలంలో బాలీవుడ్ సినిమాల్లో అండర్ వరల్డ్ ఫండ్స్ వచ్చేవనే విషయం తనకు అస్సలు తెలియదని, ఆ తర్వాత వచ్చిన సినిమాల ద్వారానే తనకూ ఈ విషయాలు తెలిశాయని మందాకిని వివరణ ఇచ్చారు.

రాజ్ కపూర్ దర్శకత్వంలో 1985లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా 'రామ్ తేరీ గంగా మైలీ'తో మందాకిని బాలీవుడ్ లోకి అరంగేట్రం చేశారు. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో ఆమె 1980ల కాలంలో బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కథానాయికలలో ఒకరిగా గుర్తింపు పొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+