అజిత్ అగార్కర్ అవుట్? ఛీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు ..! రేపు బోర్డు నిర్ణయం..!

భారత సీనియర్ క్రికెట్ జట్లకు ప్రధాన సెలెక్టర్ గా వ్యవహరిస్తున్న అజిత్ అగార్కర్ (Ajit Agarkar ) పదవీకాలం ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ఆయనకు మరోసారి పొడిగింపు ఇవ్వకూడదని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే భారత జట్టు ప్రదర్శన పడుతూ లేస్తూ సాగుతున్న తరుణంలో అజిత్ అగార్కర్ కొనసాగింపు విషయంలో బీసీసీఐ ఆసక్తిగా లేదు. దీంతో అగార్కర్ ను సాగనంపి, ఆయన స్ధానంలో కొత్త ఛీఫ్ సెలెక్టర్ ను ఎంపిక చేసేందుకు సిద్దమవుతోంది. రేపు జరిగే బీసీసీఐ వార్షిక భేటీలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోనుంది.

రోహిత్, కొహ్లీ ఇన్, హార్ధిక్ అవుట్..! విండీస్ తో వన్డేలకు భారత జట్టు ఇదే..!
రోహిత్, కొహ్లీ ఇన్, హార్ధిక్ అవుట్..! విండీస్ తో వన్డేలకు భారత జట్టు ఇదే..!

బీసీసీఐ ఛీఫ్ సెలెక్టర్ గా ఉన్న అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ నెలతో ముగియబోతోంది. ఇప్పటికే ఏడాది పొడిగింపు తీసుకున్న ఆయనకు మరోసారి పొడిగింపు ఇచ్చే ఉద్దేశంలో బీసీసీఐ లేదని ఎన్డీటీవీకి బోర్డు వర్గాలు తెలిపాయి. దీంతో అగార్కర్ స్ధానంలో కొత్త ఛీఫ్ సెలెక్టర్ గా భారత జట్టు మాజీలు, ముంబై ఐపీఎల్ టీమ్ మాజీ క్రికెటర్లు కూడా అయిన ప్రజ్ఢాన్ ఓజా, పార్దివ్ పటేల్ పేర్లను బోర్డు పరిశీలిస్తోంది. రేపు జరగనున్న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం నేపథ్యంలో, అగార్కర్‌కు పదవీకాలం పొడిగింపు లభించే అవకాశాలు దాదాపు లేవు. నిన్న వెస్టిండీస్ వన్డే సిరీస్ కోసం జరిగిన సెలెక్టర్ల సమావేశమే అగార్కర్ కు చివరిది కావచ్చని భావిస్తున్నారు.

Ajit Agarkar Out BCCI Shortlists Two IPL Players for Chief Selector Post
Gautam Gambhir: శ్రీలంక చేతిలో ఓడిపోతే గంభీర్ అవుట్ ? తేల్చేసిన బీసీసీఐ..!
Gautam Gambhir: శ్రీలంక చేతిలో ఓడిపోతే గంభీర్ అవుట్ ? తేల్చేసిన బీసీసీఐ..!

బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా అగార్కర్ స్ధానంలో మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్, మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా పోటీ పడుతున్నారరు. వీరిద్దరూ మూడుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై జట్టుకు ఆడారు. మరోవైపు తాజాగా విండీస్ సిరీస్ కోసం రోహిత్ శర్మను అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇది అగార్కర్ గత వైఖరికి భిన్నంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే గతంలో వరుస వైఫల్యాల నేపథ్యంలో వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ కోసం తమ ప్రణాళికల్లో రోహిత్ లేరని సెలెక్టర్లు గతంలోనే ఆయనకు సమాచారం ఇచ్చారు. కానీ ఇంగ్లండ్ తో చివరి వన్డేలో సత్తా చాటుకున్న రోహిత్.. విమర్శకులతో పాటు సెలెక్టర్లకూ గట్టి సమాధానం ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+