వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగం లో ఓరుగల్లు జిల్లా వాసులకు తీపి కబురు చెప్పారు. తొందరలోనే నిరుపేదలకు అందుబాటులోకి వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురానున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్లో 2018 పడకలతో బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను తొందరలోనే పేదలకు అందుబాటులోకి తీసుకు వస్తామని అన్నారు.

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మాత్రమే కాదు రాష్ట్రంలో కొత్తగా గోషా మహల్ ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. టిమ్స్ ఆల్వాల్, టిమ్స్ ఎల్బీ నగర్ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సనత్ నగర్ లో మర్రి చెన్నారెడ్డి టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభించుకున్నామన్నారు. నిరుపేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Telangana CM Revanth Reddy announced that Warangal Super Speciality Hospital will open soon

సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో వరంగల్ జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే వరంగల్ లో ఎంజీఎం ఆస్పత్రి అందుబాటులో ఉంది. అయినప్పటికీ ఎమర్జెన్సీ కేసులు హైదరాబాద్ కు వెళ్ళక తప్పని పరిస్థితి ఉంది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణలో మరో మైలురాయి పడినట్టు అవుతుంది.

మొత్తం 1371 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తవుతుందని, అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు మొత్తం 24 అంతస్తులతో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో, 2018 బెడ్ ల సామర్థ్యంతో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి రానుంది.

వినాయక మండపాలకు అదిరిపోయే ఆఫర్.. అలా నిమజ్జనం చేస్తే రూ.10,116 నగదు పురస్కారం!
వినాయక మండపాలకు అదిరిపోయే ఆఫర్.. అలా నిమజ్జనం చేస్తే రూ.10,116 నగదు పురస్కారం!

35 ఆపరేషన్ థియేటర్లు, వైద్య సిబ్బందికి నివాస వసతి, పేషెంట్స్ తో పాటు వచ్చే అటెండెన్స్ కోసం ధర్మశాల గదులు అన్ని ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబర్ నాటికి పనులన్నింటినీ పూర్తిచేసి, నవంబర్ నెలలో ట్రయల్ రన్ నిర్వహించి డిసెంబర్ 2026 లో వైద్య సేవలను అందించడం కోసం సిద్ధం చేయనున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+