నీకు నీ తమ్ముళ్లకు ఆస్తులు ఎలా వచ్చాయి..!!

తెలంగాణలో భూముల చుట్టూ రాజకీయం నడుస్తోంది. కేసీఆర్ ఫ్యామిలీ భూమలు వివరాలను బయట పెట్టిన రేవంత్.. ఇవన్నీ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. విచారణకు ఆదేశించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఎంత భూమి ఉందో వివరించారు. ఈ ఆరోపణల పైన బీఆర్ఎస్ ముఖ్య నేతల కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తమ భూముల వివరాలన్నీ ఎన్నికల ఎఫిడవిట్ లోనే ఉన్నాయని చెప్పారు. సీఎం రేవంత్.. ఆయన తమ్ముళ్లకు ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేసారు. రేవంత్ సోదరుడు అంతరిక్ష కంపెనీలా ఎలా పెట్టారని ప్రశ్నించారు.

కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల పైన సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేసారు. వీటి పైన స్పందించిన కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తాను అమెరికాలో చదువుకొని, ఉద్యోగం చేసిన డబ్బుతో భూములు కొనుక్కుంటే రేవంత్ రెడ్డి అవన్నీ అక్రమంగా రాయించుకున్న భూములని చెప్పడంపై సెటైర్ వేశారు. గోడలపై రాతలు రాసుకున్న నీకు.. జూబ్లిహిల్స్ లో ప్యాలెస్, నీ తమ్ముళ్లకు ఏరో స్పెస్ కంపెనీలు ఎలా వచ్చాయో చెప్పగలవా అంటూ ప్రశ్నించారు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బాబాయి ఎందుకు చనిపోయాడో చెప్పాలని కేటీఆర్ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ద‌ళితులు మీద ఎక్క‌డ‌లేని కురిపిస్తున్నారని.. ఒక దశలో అయితే ఎమోషనల్ అయిపోయి ప్రసాద్ గారినో, భట్టి గారినో శాస‌న స‌భ‌లో ముఖ్యమంత్రిగా ప్ర‌క‌టిస్తాడ‌ని అనుకున్నా న‌ ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిజంగా దళితుల పైన ప్రేమ ఉంటే దళిత డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయాల‌న్నారు.

 డీలిమిటేషన్ కు మద్దతు, బీజేపీతో పొత్తుపై కేటీఆర్ సంచలనం..!!
డీలిమిటేషన్ కు మద్దతు, బీజేపీతో పొత్తుపై కేటీఆర్ సంచలనం..!!
brs-working-president-ktr-seriously-reacts-over-cm-revanth-allegations-against-kcr-family-lands

ఎన్నికల అఫిడవిట్ లో వివరాలు ఉన్నాయి

అదే విధంగా కేసీఆర్ దళిత బంధు రూ.10 లక్షలు ఇస్తాను అంటే రూ.12 లక్షలు ఇస్తానని కోత‌లు కోసారని ఆరోపించారు. ఇలాంటివి ఏమీ చేయకుండా నోటికి వచ్చినట్లు శిఖ‌ర స‌మానుడైన కేసీఆర్ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అట్ట‌ర్ ప్లాప్ అయిన సినిమాకు శ‌త‌జ‌యంతి వేడుక‌లు అన్న‌ట్లుగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని ఎద్దేవా చేశారు. తన తండ్రి ఎన్నికల అఫిడ విట్‌లో తన ఆస్తి, భూముల వివరాలను పొందుపర్చారని చెప్పారు. వాటిని ఒకసారి చూసుకొని మాట్లాడాలని హెచ్చరించారు. కేవలం డిగ్రీ మాత్రమే చదివిన రేవంత్ రెడ్డికి ఇన్నీ వేల ఎకరాల భూమి, ఆస్తులు, కుటుంబ సభ్యుల పేరుతో కంపెనీలు ఎలా వచ్చాయో చెప్పగలరా అంటూ ప్రతిదాడికి దిగారు కేటీఆర్. తమ పార్టీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+