రైల్వే బాటలో తెలంగాణా ఆర్టీసీ. హైటెక్ హంగులతో, షాపింగ్ ఫెసిలిటీస్ తో బస్ స్టేషన్లు!

భారతీయ రైల్వే రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు అమృత్ భారత్ స్టేషన్ స్కీం లో భాగంగా రైల్వే స్టేషన్ ల ఆధునికీకరణ పనులు చేస్తున్నారు. అచ్చం ఎయిర్ పోర్ట్ ల తరహాలో అద్భుతంగా తీర్చి దిద్దుతున్నారు. ఇదే క్రమంలో టీజీఎస్ఆర్టీసీ కూడా రైల్వేబాటలో అధునాతన బస్ స్టాండ్ ల నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. బస్సుల కోసం ఎదురుచూసే ప్రయాణికులకు ఆహ్లాద వాతావరణం, షాపింగ్ కూడా కల్పించాలని నిర్ణయం తీసుకుంది.

టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికుల అనుభవాన్ని పూర్తిగా మార్చే దిశగా పెద్ద నిర్ణయం తీసుకుంది. కేవలం బస్సు ఎక్కడం, దిగడం మాత్రమే కాకుండా షాపింగ్, వ్యాపారం, వినోదం అన్నీ ఒకే చోట అందుబాటులో ఉండేలా 13 హైటెక్ బస్ స్టేషన్లు నిర్మించనుంది. ఇవి 'ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ సిస్టమ్' విధానంలో రూపొందుతాయి. రైల్వేస్టేషన్లు, ఇతర రవాణా మార్గాలతో అనుసంధానం కల్పించి, ఎయిర్‌పోర్ట్ స్థాయి సదుపాయాలతో తీర్చిదిద్దనున్నారు.

TGSRTC plans 13 high-tech bus stations across Telangana with shopping complexes business hubs food courts

టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి ఆలోచనతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ నుంచి అధికారిక అనుమతులు ఇప్పటికే లభించాయి. గతంలో బస్టాండ్లు అంటే ఇరుకు ప్రదేశాలు, అసౌకర్యాలు అనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నంగా నూతన బస్ స్టేషన్లలో మల్టీ-మోడల్ కనెక్టివిటీ ఉంటుంది. బస్సు దిగగానే రైల్వే లేదా ఇతర రవాణా సాధనాలను సులభంగా చేరుకునే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా షాపింగ్ కాంప్లెక్స్‌లు, బిజినెస్ స్పేస్‌లు కూడా ఏర్పాటు కానున్నాయి. స్థానిక వ్యాపారులు, ప్రముఖ కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి వాణిజ్య సముదాయాలు కేటాయించనున్నారు. ప్రయాణికులు వేచి ఉండే సమయంలో విసిగిపోయేలా గేమింగ్ జోన్లు, ఫుడ్ కోర్టులు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రాంతాలు ఉంటాయి. ఒకే చోట అన్ని సదుపాయాలు అందుబాటులోకి రావడంతో బస్ ప్రయాణం మరింత ఆహ్లాదకరంగా మారనుంది.

మోదీ 25ఏళ్ల ప్రజాప్రస్థానం.. ఆశీర్వాద దీపం.. అక్టోబర్ 17వరకు బీజేపీ బిగ్ ప్లాన్!
మోదీ 25ఏళ్ల ప్రజాప్రస్థానం.. ఆశీర్వాద దీపం.. అక్టోబర్ 17వరకు బీజేపీ బిగ్ ప్లాన్!

ఈ 13 హైటెక్ బస్ స్టేషన్లు ఏర్పాటు కానున్న ప్రాంతాలు - నాగర్‌కర్నూల్, రేగొండ, హుజూర్‌నగర్, కోదాడ, కొడంగల్, కోస్గి, మద్దూరు, కేసముద్రం, హుస్నాబాద్, ములుగు, మధిర, నల్గొండ, కొత్తగూడెం. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు, ప్రయాణికులకు ఇది పెద్ద వరంగా మారనుంది. షాపులు, బిజినెస్ కాంప్లెక్స్‌ల కేటాయింపు కోసం ఆసక్తి ఉన్న వ్యాపారులు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యాన్ని సంప్రదించవచ్చని సంస్థ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+