డీలిమిటేషన్ కు మద్దతు, బీజేపీతో పొత్తుపై కేటీఆర్ సంచలనం..!!

డీలిమిటేషన్.. బీజేపీ తో పొత్తు పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. నియోజకవర్గాల పునర్విభజన కు తమ మద్దతు ఉంటుందంటూనే.. కండీషన్లు పెట్టారు. ఇక.. బీజేపీతో పొత్తు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. ప్రస్తుతం కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య అసెంబ్లీ వేదికగా హోరా హోరీ రాజకీయం చోటు చేసుకుంటోంది. కేసీఆర్ కుటుంబం భూ కబ్జాలంటూ అసెంబ్లీ వేదికగా రేవంత్ చిట్టా బయట పెట్టారు. ఈ సమయంలోనే కేటీఆర్ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. పొత్తులు.. డీలిమిటేషన్ పైన తమ పార్టీ వైఖరి తేల్చి చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం ప్రాతినిధ్యం ఉందని, మొత్తం లోక్‌సభ స్థానాలను దామాషా ప్రకారం పెంచితే.. డీలిమిటేషన్‌ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని పేర్కొన్నారు. హరియాణాలోని సోనిపట్‌లో ఉన్న జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీలో బుధవారం ''ఇన్నోవేషన్‌ ఇన్‌ గవర్నెన్స్‌: ది స్టోరీ ఆఫ్‌ ఏ స్టార్టప్‌ స్టేట్‌'' అనే అంశంపై కేటీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రతీ పెద్ద సాంకేతిక పరివర్తన సమయంలో ఆందోళనలు వ్యక్తమయ్యాయన్నారు. ప్రస్తుతం ఏఐ విషయంలోనూ అదే జరుగుతోందని, దాన్ని స్వీకరించి ముందుకు సాగాల్సిందేనని అభిప్రాయపడ్డారు.

 శ్రీవారి భక్తులకు స్కైవాక్ బ్రిడ్జి, కొత్త యాప్ : శ్రీవారి సేవకులు ఇక - చంద్రబాబు..!!
శ్రీవారి భక్తులకు స్కైవాక్ బ్రిడ్జి, కొత్త యాప్ : శ్రీవారి సేవకులు ఇక - చంద్రబాబు..!!
ktr-rules-out-bjp-alliance-ahead-of-2028-telangana-assembly-elections-clarifies-on-support-for-del

తేల్చేసిన కేటీఆర్

అదే విధంగా మౌలిక వసతులు కల్పించడం, విశ్వసనీయమైన సేవలందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ.. తెలంగాణలోని కరువు ప్రభావిత ప్రాంతాలకు గోదావరి జలాలను ఎలా తరలించాలనే సవాల్‌కు ఇంజనీరింగ్‌ పరిష్కారమే ఈ ప్రాజెక్టు అని అభివర్ణించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి జరిగిన మూడు సార్వత్రిక ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేసిందని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని ఆయన గుర్తుచేశారు. తమ సిద్ధాంతం , వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, భవిష్యత్తులో కూడా బీజేపీతో జతకట్టే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేతలు పదే పదే బీజేపీ- బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో బీజేపీతో పొత్తుల పైన కేటీఆర్ తేల్చి చెప్పటంతో రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+