'రావు బహదూర్' పై మహేశ్ బాబు, సుకుమార్ షాకింగ్ రివ్యూ..

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు ప్రయోగాత్మక సినిమాలతో ముందుంటారు సత్యదేవ్. ఇప్పుడు సైకలాజికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన లీడ్​ రోల్​ లో వెంకటేశ్ మహా తెరకెక్కించిన సినిమా 'రావు బహదూర్'. ఈ మూవీ జూలై 3 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ మూవీలో సత్యదేవ్ లుక్స్, ఆయన గెటప్ మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటివరకూ రిలీజ్ అయిన కంటెంట్ చూస్తే.. ఈ మూవీ సైకలాజికల్ డ్రామా, డార్క్ కామెడీ, సస్పెన్స్ అని అర్థం అవుతోంది.

అయితే 'రావు బహదూర్' మూవీపై సూపర్ స్టార్ మహేశ్ బాబు షాకింగ్ రివ్యూ ఇచ్చారు. ఇటీవల మూవీ చూసిన ఆయన తన అభిప్రాయాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. ఈ మూవీ విచిత్రంగా, అందంగా ఉంటుందని అన్నారు. మీ కాలర్ పట్టుకుని లాగే సినిమా మాత్రమే కాదని.. మీ హృదయాల్లోకి వెళ్లే సినిమా అని అన్నారు. దర్శకుడు వెంకటేశ్ మహా అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు.. సత్యదేవ్ ఆ ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు. మూవీ టీం మొత్తానికి చాలా గర్వంగా ఉంది. టెక్నికల్ టీం శ్రమ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆడియన్స్ ఈ కొత్త తరహా మాడ్ నెస్ ఎక్స్‌పీరియన్స్‌ను థియేటర్లలో తప్పకుండా ఆస్వాదిస్తారు.. అని మహేశ్ బాబు రివ్యూ ఇచ్చారు.

'రావు బహదూర్' మూవీపై మహేశ్ బాబు ప్రశంసలతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. దాంతోపాటు అటు మూవీ లవర్స్ లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ సైతం ఈ మూవీకి రివ్యూ ఇచ్చారు. మూవీ చూశాక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు సుక్కూ.

టీమ్‌ను గట్టిగా హగ్ చేసుకొని అభినందించారు. రావు బహదూర్ లాంటి సినిమా ఇప్పటివరకు టాలీవుడ్‌ లోనే కాదు.. అసలు ఇండియన్ స్క్రీన్ పైనే రాలేదని అన్నారు. సినిమా చూశాక పరిశ్రమలోని ప్రతి ఆర్టిస్ట్ సత్యదేవ్ ను చూసి ఖచ్చితంగా జెలసీ ఫీల్ అవుతారని.. ఎందుకంటే ఇలాంటి పవర్‌ ఫుల్ పాత్రలు చేసే అవకాశం అందరికీ రాదని అన్నారు. సినిమా చూస్తున్నంత సేపు నేను లీనమైపోయా.. నన్ను మైమరిపించింది.. అని తెలిపారు. వెంకటేశ్ మహా ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ ఫైనల్‌గా సక్సెస్ సాధించారు.. అని ప్రశంసలు కురిపించారు.

RaoBahadur Movie Review by Mahesh Babu and Sukumar Satyadev Film Gets Feedback Rao Bahadur review

ఇక ప్రపంచవ్యాప్తంగా 'రావు బహదూర్' మూవీ జూలై 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీలో సత్యదేవ్‌ తో పాటు దీప థామస్, వికాస్ ముప్పాళ్ల, బాలా పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ కీలకపాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాను GMB ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో A+S మూవీస్, శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. అలాగే చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మాతలుగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+