వినాయక చవితి 2026: "వోకల్ ఫర్ లోకల్" థీమ్ తో ప్రధాని

వినాయక చవితి పండుగను పర్యావరణహితంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రానున్న వినాయక చవితి సందర్భంగా, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP)తో చేసిన విగ్రహాలను కాకుండా, మన దేశ మట్టితో స్థానిక కుమ్మరులు, కళాకారులు తయారు చేసిన మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని ఆయన కోరారు. విగ్రహాలు కొనే ముందు అవి దేనితో తయారయ్యాయో, ఎక్కడ తయారయ్యాయో సరిచూసుకోవాలని ప్రధాని ప్రజలకు సూచించారు.

మట్టితో చేసిన విగ్రహాలు పండుగ ముగిసిన తర్వాత నీటిలో సహజంగా కలిసిపోతాయని, తద్వారా నదులు, చెరువులు కలుషితం కాకుండా ఉంటాయని మోదీ వివరించారు. మట్టి విగ్రహాలను వాడటం వల్ల మన సంప్రదాయాలను పాటిస్తూనే, ప్రకృతి పట్ల మనకున్న బాధ్యతను నెరవేర్చవచ్చని ఆయన తెలిపారు. అంతేకాకుండా, స్థానిక కళాకారుల వద్ద విగ్రహాలను కొనుగోలు చేయడం ద్వారా 'వోకల్ ఫర్ లోకల్' (Vocal for Local) స్ఫూర్తిని బలపరుస్తామని, ఇది దేశ ప్రయోజనాలకు దోహదపడుతుందని ప్రధాని పేర్కొన్నారు.

Vinayaka Chavithi 2026 Celebrate Eco-Friendly Ganesh Utsav PM Modi Urges Citizens to Use Clay Idols amp amp Shun Plaster of Paris

చెత్త నుంచి సంపద: మహిళల అద్భుత కృషి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా, బియావ్రాకు చెందిన మహిళల కృషని ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు. తమ పరిసరాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి నిరాశ చెందకుండా, ఆ మహిళలు స్వయంగా రంగంలోకి దిగి ప్లాస్టిక్ వ్యర్థాలను, ఖాళీ బాటిళ్లను సేకరించడం ప్రారంభించారని ఆయన వివరించారు.

ఈ ప్లాస్టిక్‌ను 'ఈకో-బ్రిక్స్‌'గా మార్చి, బహిరంగ ప్రదేశాలను సుందరీకరించడానికి ఉపయోగిస్తున్నారని, గత కొద్ది నెలల్లోనే వందల కిలోల ప్లాస్టిక్ రీసైక్లింగ్ జరిగిందని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఒకప్పుడు కాలుష్యానికి కారణమైన ప్లాస్టిక్, నేడు నగర సౌందర్యానికి చిహ్నంగా మారడం ఆ మహిళల కృషికి నిదర్శనమని ప్రధాని కొనియాడారు.

నీటిని పొదుపు చేద్దాం - 'క్యాచ్ ద రెయిన్'

ప్రకృతిని కాపాడుకోవడంలో భాగంగా, కొనసాగుతున్న 'క్యాచ్ ద రెయిన్' (Catch the Rain) ప్రచారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. వర్షపు నీటి ప్రతి చుక్కను వృథా చేయకుండా ఆదా చేయాలని, ఈ ఉద్యమ స్ఫూర్తి ఏమాత్రం తగ్గకూడదని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మోదీ దేశ ప్రజలను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+