ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం.. ఆస్పత్రికి తరలింపు..!

పశ్చిమాసియాలో ఘర్షణల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించినట్లు స్పష్టం అవుతోంది. ఛానెల్ సీ 14 నుంచి వస్తున్న వివరాల ప్రకారం.. అలాగే ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కు క్లోజ్ గా ఉన్న కొన్ని మీడియా కథనాల ఆధారంగా ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే వీరమరణం పొందాడన్న వార్త బయటకు వచ్చినా ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదని జెరుసలెం పోస్ట్ వెల్లడించింది.

అమెరికా చేపట్టిన దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ హతం అయిన నేపథ్యంలో ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన ఎప్పుడూ బహిరంగ ప్రదేశాల్లో కనిపించలేదు. కానీ రాతపూర్వకంగానే మొజ్తబా ఖమేనీ తన ఆదేశాలను అధికారులకు జారీ చేశారు. ఇక తన తండ్రి గాయపడిన సమయంలోనే అమెరికా దాడుల్లో మొజ్తబా ఖమేనీ కూడా గాయపడినట్లు కొన్ని కథనాలు వెల్లడిస్తున్నాయి. దాంతో ఆయన రహస్యంగా ఉంటూ సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టం అవుతోంది.

ఇదే అంశంపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఓ స్టేట్ టీవీ మీడియాలో మాట్లాడుతూ.. ఖమేనీతో ప్రత్యక్షంగా మాట్లాడటం చాలా కష్టమైన పని అని అన్నారు. అలాగే అంతర్జాతీయ కథనాలు సైతం మొజ్తబా ఖమేనీ ఎక్కడున్నారు..? అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి.

Mojtaba Khamenei Condition of Iran s Supreme Leader Mojtaba Khamenei critical shifted to hospital

ఇదే విషయంపై గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇరాన్ కు చెందిన టాప్ మిలిటరీ లీడర్ షిప్ ఎలిమినేట్ అయింది. అలాగే ఖమేనీ 90 శాతం పోయారు అని తెలిపారు. ఇక అంతకుముందు మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై అసలు విషయాన్ని ఇరాన్ ప్రభుత్వం కప్పి పుచ్చే ప్రయత్నం చేసింది. అయితే అతను నిరంతరం ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించకపోవడం.. నేరుగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడకపోవడం.. అలాగే అతని నాయకత్వ స్థిరత్వంపై ప్రాంతీయ, అంతర్జాతీయ కథనాలు వ్యక్తం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+