వెబ్ సిరీస్ చూసి.. భార్యను చంపి.. వీడు మామూలోడు కాదయ్యో..!

దేశ రాజధాని దిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. వెబ్ సిరీస్ చూసి భార్యను కిరాతకంగా చంపేశాడు ఓ వ్యక్తి. ఆ తర్వాత ఇంట్లోని డబ్బులతో పరార్ అయ్యాడు. ఆస్తి వివాదంతో పాటు మరో మహిళకు ఆయన దగ్గర అవ్వడమే ఈ హత్యకు కారణాలని విచారణలో పోలీసులు గుర్తించారు. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న దారుణ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ షాకింగ్ ఘటనపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

THE STAIRCASE అనే వెబ్ సిరీస్ చూసి కట్టుకున్న భార్యను కిరాతకంగా హతమార్చాడు ఓ వ్యక్తి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీలో నివాసం ఉన్న కమల్ సింగ్(62), కోమల్ సింగ్ దంపతులకు ఒక కుమారుడు(26), ఓ కుమార్తె ఉన్నారు. జులై 30 న కుమారుడు లైబ్రరీకి, కుమార్తె ఆఫీస్‌ పనిమీద వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో కమల్, కోమల్ మాత్రమే ఉన్నారు. అయితే మధ్యాహ్నం 1 గంటకు కోమల్ బట్టలు ఆరబెడుతుండగా.. కమల్ వెనుక నుంచి కత్తితో దాడికి పాల్పడ్డాడు.

దాంతో కోమల్ కేకలు వేస్తూ కిచెన్ వైపునకు పరుగులు తీసింది. కిచెన్ లో ఓ మూలన దాక్కుంది. ఆమెను కమల్ బలవంతంగా బయటకు లాగి కత్తెరతో పలుమార్లు పొడిచి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత స్నానం చేసి.. భార్య రూమ్ లోని రూ. 5 లక్షలు తీసుకున్నాడు. అలా స్కూటర్ పై ఇంటి నుంచి పరారయ్యాడు. ఇక మార్గమధ్యలో రెండు బ్యాంక్ ఖాతాల నుంచి మరో రూ. 7 లక్షలు తీసుకుని వెళ్లిపోయాడు. అయితే రాత్రి ఇంటికి వచ్చిన కుమారుడు రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి పోలీసుల్ని ఆశ్రయించాడు.

కమల్ కనిపించకపోవడంతో.. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో అతని ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశారు. ఇక్కడే నిందితుడు కమల్.. ఈ కేసుని పక్కదారి పట్టించేందుకు తెలివిగా ప్రవర్తించాడు. గోరఖ్ పూర్ దిశగా వెళ్తున్నప్పుడు ఫోన్ ఆన్ చేసి.. నేపాల్‌ కు పారిపోతున్నట్టు పోలీసుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. గోరఖ్ పూర్‌ కు చేరుకున్నాక ఫోన్ స్విచ్చాఫ్ చేసి.. తాను దొరకకుండా ఉండేందుకు మాథురకు బయల్దేరాడు.

delhi Shocking incident in Delhi Husband kills wife after watching web series escapes with money

అలా చివరికి మూడు రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు మాథుర రైల్వే స్టేషన్‌ లో కమల్‌ ను అరెస్ట్ చేశారు. అతని స్కూటర్‌ ను సీజ్ చేయడంతో పాటు డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తనని విచారించినప్పుడు.. THE STAIRCASE అనే వెబ్ సిరీస్ ను చూసి తన భార్యను చంపినట్లు వెల్లడించాడు. మర్డర్ వెపన్ (కత్తి) దొరక్కుండా ఉండేందుకు దాన్ని నాశనం చేయాలని కూడా పన్నాగం పన్నినట్టు తెలిపాడు. అయితే ఆస్తి వివాదంతో పాటు మరో మహిళకు కమల్ దగ్గర అవ్వడమే ఈ హత్యకు కారణాలని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+