ఏపీలో భారీగా ఐఏఎస్ బదిలీలు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..!

ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. మొత్తం 22 మంది ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి ఆమ్రపాలిని రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ మేరకు GAD కు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అలాగే పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గా శ్యామలరావు, విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ గా ప్రఖర్ జైన్‌, ఇక APSRTC జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌ గా ఎం. శివ ప్రసాద్.. అలాగే ఏపీ స్టేట్ ఫైబర్‌ నెట్ లిమిటెడ్ ఎండీగా గీతాంజలి శర్మ నియామకం అయ్యారు.

ఇక పురావస్తుశాఖ కమిషనర్ గా ముత్యాల రాజు నియమితులయ్యారు. ఆరోగ్యశాఖ కమిషనర్‌ గా చక్రధరబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. హౌసింగ్ శాఖ స్పెషల్ సీఎస్‌గా హెబ్సీబా రాణిని బదిలీ చేశారు. అలాగే గోదావరి పుష్కర బాధ్యతలను అధికారులు సురేష్, భరత్‌ లకు అప్పగించారు. ఇక రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శిగా కోనా శశిధర్ బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు ఏపీ టూరిజం డెవలప్‌ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌ గా ఉన్న ఆమ్రపాలిని ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది. ప్రస్తుతం ఎలాంటి కొత్త పోస్టింగ్ ఇవ్వలేదు. అలా సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

IAS Massive IAS reshuffle in AP No posting for Amrapali AP IAS Transfers 2026 latest update news

ఇక ఆమ్రపాలి స్థానంలో పట్టంశెట్టి రవి సుభాష్‌ ను ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌ గా నియమించారు అధికారులు. అదనంగా APPSC లో CEO, సెక్రటరీ పోస్టులకు కూడా ఆయనకు FAC బాధ్యతలు అప్పగించారు. అలాగే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కు ఎం. జయకృష్ణను కొత్త కమిషనర్ గా నియమించారు. టీటీడీలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విభాగానికి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా శరత్ కొనసాగనున్నారు. ఇక అదే డిపార్ట్ మెంట్ కు ప్రభల గోపీనాథ్ జాయింట్ ఈవోగా నియమించారు. వీరితో పాటు గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా సురేష్ కుమార్, జాయింట్ స్పెషల్ ఆఫీసర్‌ గా నారాయణ భరత్ గుప్తా నియామకం అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+