వాస్తు ప్రకారం ఇంట్లో, ఆఫీసులో కుర్చీ ఖాళీగా ఉంచొచ్చా?

మనం నివసించే ఇల్లు లేదా పని చేసే ఆఫీసులో ఉండే ప్రతి వస్తువుకూ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అందుకే వాస్తుశాస్త్రంలో ప్రతి చిన్న వస్తువును కూడా సరైన స్థానంలో ఉంచాలని పెద్దలు చెబుతుంటారు. అయితే మన దైనందిన జీవితంలో నిత్యం ఉపయోగించే 'కుర్చీల' విషయంలో చాలా మంది తెలియకుండానే కొన్ని పెద్ద తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా ఆఫీసు టేబుల్ ముందు కానీ, ఇంట్లో కానీ కుర్చీలను ఎక్కువ సమయం పాటు ఖాళీగా వదిలేయడం వల్ల తీవ్రమైన ఆర్థిక నష్టాలు, కెరీర్ పరంగా ఇబ్బందులు వస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కుర్చీల వల్ల వచ్చే దోషాలు, వాటికి చేయాల్సిన చిన్న చిన్న మార్పుల గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Chairs

ఖాళీ కుర్చీ - నెగెటివ్ ఎనర్జీకి నిలయం

వాస్తు నియమాల ప్రకారం.. ఇంట్లో లేదా ఆఫీసులో ఒక కుర్చీని ఎక్కువ రోజుల పాటు ఎలాంటి వాడకం లేకుండా అలాగే వదిలేయడం అస్సలు మంచిది కాదు. శూన్యంగా ఉండే ఆ ప్రదేశం ప్రతికూల శక్తులను త్వరగా ఆకర్షిస్తుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఎక్కువ సమయం ఖాళీగా ఉండే కుర్చీ రాహు, కేతువుల ప్రతికూల ప్రభావానికి కారణమవుతుంది. దీనివల్ల ఇంట్లోని ప్రశాంతత లోపించి, కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన మనస్పర్థలు, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

ఆఫీసులో ఖాళీ కుర్చీతో కెరీర్ అడ్డంకులు

మనం పని చేసే ఆఫీసులో కూర్చునే కుర్చీ మన కెరీర్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. చాలా మంది ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి వెళ్లేటప్పుడు లేదా ఎక్కువ రోజులు సెలవులపై వెళ్లేటప్పుడు తమ వర్క్ టేబుల్ ముందు ఉన్న కుర్చీని అలాగే ఓపెన్ గా వదిలేసి వెళ్తుంటారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో అనుకోని అడ్డంకులు రావడం, సహచరులతో లేదా పై అధికారులతో సంబంధాలు దెబ్బతినడం, ఆర్థికంగా నష్టపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

దోష నివారణకు పాటించాల్సిన చిట్కాలు

ఇంట్లో లేదా ఆఫీసులో కుర్చీల వల్ల ఎలాంటి వాస్తు దోషాలు రాకుండా ఉండాలంటే.. మీ ఇంట్లో ఏదైనా కుర్చీని ఎక్కువ సమయం వాడకుండా పక్కన పెడితే.. దాన్ని బోసిగా వదిలేయకుండా దానిపై ఒక అందమైన కుషన్ లేదా మంచి డిజైన్ ఉన్న క్లాత్ పరిచి ఉంచాలి. ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరేటప్పుడు మీ కుర్చీని అలాగే వదిలేయకుండా, వర్క్ టేబుల్ లోపలికి (టేబుల్ కిందకు) పూర్తిగా నెట్టేసి వెళ్లాలి. సెలవులపై వెళ్లేటప్పుడు వీలైతే ఆ కుర్చీపై ఏదైనా ఫైల్, డైరీ లేదా ఒక పుస్తకాన్ని ఉంచడం మంచిది. దీనివల్ల ఆ కుర్చీ ఖాళీగా ఉన్నట్లు పరిగణించబడదు, నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది.

విరిగిన కుర్చీలను అస్సలు ఉంచొద్దు

ఇంట్లో కాళ్ళు విరిగిన, పగుళ్లు వచ్చిన లేదా పూర్తిగా పాడైపోయిన కుర్చీలను ఉంచడం అస్సలు మంచిది కాదు. ఇలాంటి విరిగిన వస్తువులు శని దోషాన్ని పెంచుతాయని నమ్ముతారు. కాబట్టి ఇంట్లో లేదా ఆఫీస్ ప్రాంగణంలో పాతబడిన, విరిగిన ప్లాస్టిక్ లేదా చెక్క కుర్చీలు ఉంటే వాటిని వెంటనే తొలగించడం లేదా రిపేర్ చేయించడం ఉత్తమం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+