ఏపీ లాజిస్టిక్స్ హబ్.. ఈ ఏడాది అందుబాటులోకి రెండుపోర్టులు!
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా పురోగతిలోకి తీసుకురావటానికి తగిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఏపీలోని తూర్పు తీరప్రాంతంలో అత్యుత్తమ లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోర్టుల నిర్మాణాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం మరియు కాకినాడ గేట్‌వే పోర్టుల పనులు వేగంగా సాగుతున్నాయి.
ఈ ఏడాది చివరినాటికి ఈ పోర్టులలో వాణిజ్య కార్యాకలాపాలు
ఈ ఏడాది చివరి నాటికి రామాయపట్నం మరియు మూలపేట పోర్టుల నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. మచిలీపట్నం పోర్టు వచ్చే ఏడాది, కాకినాడ గేట్‌వే పోర్టు 2028 నాటికి అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలో రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల నిర్మాణానికి రూ.14,447 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

నాలుగు కొత్తపోర్టులు పూర్తి అయితే పెరగనున్న రాష్ట్రసరకు రవాణా సామర్థ్యం
కాకినాడ గేట్‌వే పోర్టు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం PPP మోడల్‌లో నిర్మాణం జరుగుతోంది. ఈ నాలుగు కొత్త పోర్టులు పూర్తి అయితే రాష్ట్ర సరకు రవాణా సామర్థ్యం ఏటా అదనంగా 109 మిలియన్ టన్నులు పెరుగుతుంది. ప్రస్తుతం విశాఖపట్నం మేజర్ పోర్టు మరియు ఇతర నాన్-మేజర్ పోర్టుల ద్వారా సుమారు 200 మిలియన్ టన్నుల సరకు రవాణా జరుగుతోంది.
రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానం చేసే పనులు
రామాయపట్నం పోర్టు నిర్మాణం ఇప్పటికే 78.28 శాతం పూర్తి కాగా, మూలపేట పోర్టు 75.5 శాతం, మచిలీపట్నం 57.91 శాతం, కాకినాడ గేట్‌వే 41 శాతం పూర్తయ్యాయి. ఈ పోర్టులను రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానం చేసే పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. రవాణా వ్యయాలను తగ్గించి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కొత్త పోర్టులు అందుబాటులోకి వస్తే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి బలం
లాజిస్టిక్స్ రంగంలోని అన్ని సేవలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా వ్యాపారులకు సౌకర్యం కల్పిస్తుంది. ఈ కొత్త పోర్టులు అందుబాటులోకి వస్తే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి బలం చేకూరుస్తాయి. ఉపాధి అవకాశాలు పెరిగి, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను టైమ్ బౌండ్‌గా పూర్తి చేసి తూర్పు తీరంలో ఏపీని మేజర్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యం పెట్టుకుంది. ఇది రాష్ట్రానికి కొత్త ఆర్థిక ఇంధనం అవుతుంది.













Click it and Unblock the Notifications