మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంపై సీబీఐ విచారణకు బండారు డిమాండ్: వైసీపీ కౌంటర్

అమరావతి: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంపై తెలుగుదేశం పార్టీ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యల తీవ్రత తగ్గట్లేదు. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్, జేఏసీ నాయకుడు కొలికపూడి శ్రీనివాస్.. మేకపాటి మరణంపై పోస్ట్ చేసిన ట్వీట్‌కు సంబంధించిన ప్రకంపనలు తగ్గకముందే- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అలాంటి వ్యాఖ్యలే చేశారు. అవి కాస్తా దుమారం రేపాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు.

 సీబీఐతో విచారణకు డిమాండ్..

సీబీఐతో విచారణకు డిమాండ్..

మేకపాటి హఠాన్మరణంపై కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని బంగారు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకుని రాలేకపోవడంతో ప్రభుత్వం ఆయనపై విపరీతమైన ఒత్తిళ్లను తీసుకొచ్చిందని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో టీడీపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం సందర్భంగా బండారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత కూడా ఆయన తన ఆరోపణలను పునరుద్ధాటించారు.

గౌతమ్ రెడ్డిపై ఒత్తిళ్లు..

గౌతమ్ రెడ్డిపై ఒత్తిళ్లు..

దుబాయ్ ఎక్స్‌పోలో ఉన్న గౌతమ్ రెడ్డిని బెదిరింపులకు గురి చేశారని, పలుమార్లు ఫోన్లు చేసి, ఒత్తిడి తెచ్చారని సత్యనారాయణ మూర్తి అన్నారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, అప్పుడే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే గౌతమ్ రెడ్డి హఠాన్మరణం అందరికీ ఆవేదనకు గురి చేసిందని, అలాంటి నాయకుడిపై ఒత్తిడి తీసుకొచ్చారని అన్నారు.

మతిభ్రమించినట్టే..

మతిభ్రమించినట్టే..

ఈ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోన్నారు. బండారు సత్యనారాయణ మూర్తికి మతిభ్రమించిందని ఎద్దేవా చేస్తోన్నారు. పట్టపగలు మద్యం మత్తులో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తన నోటిని అదుపులో పెట్టుకోకుంటే చీరేస్తామని శాసన సభ్యుడు గుడివాడ అమర్‌నాథ్ హెచ్చరించారు. గౌతమ్‌రెడ్డి దురదృష్టవశాత్తు గుండెపోటుతో మరణించారని, ఈ విషాదాన్ని ప్రభుత్వం, పార్టీ మాత్రమే కాకుండా ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.

 నీచంగా ట్రైనింగ్..

నీచంగా ట్రైనింగ్..

చంద్రబాబు తమ నాయకులను మరీ ఇంత నీచంగా ట్రైనింగ్ ఇచ్చారని అమర్‌నాథ్ అన్నారు. వారితో మద్యం తాగించి మాట్లాడిస్తున్నాడని విమర్శించారు. టీడీపీ దిగజారుడుతనానికి ఇంతకన్నా పరాకాష్ట ఉండదని అన్నారు. వారం రోజుల పాటు దుబాయ్‌లో నిర్వహించిన ఎక్స్‌పోలో పాల్గొన్న మంత్రి రాష్ట్రానికి 5,000 వేల కోట్ల రూపాయలకు పైగా ఒప్పందాలు చేసుకొని విజయవంతంగా తిరిగి వచ్చారని చెప్పారు. ఈ ఘటనపై నోటికొచ్చినట్లు మాట్లాడిన బండారు... తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఆ కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రిప్ వైజాగ్ టీడీపీ..

రిప్ వైజాగ్ టీడీపీ..

వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజ‌య‌సాయి రెడ్డి కూడా బండారు సత్యనారాయణపై ఘాటు విమర్శలు సంధించారు. ఒక నాయకుడు మరణిస్తే హుందాగా నివాళులు అర్పించాల్సింది పోయి, నీచమైన కామెంట్స్ చేయడం టీడీపీ నేతలకే సాధ్యమైందని అన్నారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి మాటలు వింటే టీడీపీ మానసిక వైకల్యం అర్ధమవుతుందని చెప్పారు. టీడీపీ పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన పార్టీగా అభివర్ణించారు. రిప్ వైజాగ్ టీడీపీ అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+