Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పప్పు దానికి కూడా పనికిరాడు; చంద్రబాబుకు దిక్కు తోచటం లేదు పాపం: సాయిరెడ్డి వ్యంగ్యం

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబును, లోకేష్ ను, టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. శాసనమండలిలో తాళిబొట్లతో ప్రదర్శన చేపట్టిన టీడీపీ నేతల తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. ఇక మూడు రాజధానుల వ్యవహారంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విజయ సాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నీతిలేని నాయకుడంటూ నిప్పులు చెరిగారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మూడు రాజధానులు అభివృద్ధి కొనసాగుతుందని జగన్ అసెంబ్లీలో ప్రకటన చేయడంతో పచ్చ బ్యాచ్ గుండెల్లో గునపం దిగిందని విజయసాయి రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

 చంద్రబాబు ఒకే రాజధాని నినాదం అంతు లేని వ్యధగా మిగిలిపోయినట్టే: సాయిరెడ్డి

చంద్రబాబు ఒకే రాజధాని నినాదం అంతు లేని వ్యధగా మిగిలిపోయినట్టే: సాయిరెడ్డి

శాసనాలు చేసే అధికారం చట్టసభలకే ఉంటుందని ఇందులో సందేహమేల అని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి ఎవరి పరిధిలో వారు ఉండాల్సిన అవసరం ఉందని రాజ్యాంగానికి లోబడే అన్ని వ్యవస్థలు పని చేయాలని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ మీద అచంచల గౌరవం, విశ్వాసం వైసీపీకి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక మూడు రాజధానులు వ్యవహారంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, మూడు రాజధానుల అభివృద్ధి కొనసాగుతుందని జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనతో పచ్చ బ్యాచ్ కు నిద్ర పట్టడం లేదని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. పేల్చిన టపాసులు, పంచిన మిఠాయిల ఖర్చులూ వేస్ట్ అయ్యాయి అంటూ టీడీపీపై సెటైర్లు వేశారు. ఇక ఒకే రాజధాని నినాదం అంతు లేని వ్యధగా మిగిలిపోయినట్టే అంటూ విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పిడకకు ఒక ప్రయోజనం ఉంటుందని, కానీ పప్పు దానికి కూడా పనికిరాడు

పిడకకు ఒక ప్రయోజనం ఉంటుందని, కానీ పప్పు దానికి కూడా పనికిరాడు


అంతేకాదు నీతి లేని నాయకుడు ఎవరని అడిగితే భవిష్యత్తు తరాలు చంద్రబాబును చూపిస్తాయని మండిపడ్డారు. అధికార దుర్వినియోగంతో ఆయన చేసిన అరాచకాలు దేశంలో ఎవరూ చేసి ఉండరని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చివరకు ఏకైక పుత్రిక రత్నాన్ని మహిళల పట్ల గౌరవం లేని కుసంస్కారిని చేశారంటూ విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. పిడకకు ఒక ప్రయోజనం ఉంటుందని, కానీ పప్పు దానికి కూడా పనికిరాడు అంటూ విజయసాయి రెడ్డి లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బాబూ... మీ మైండ్ గజిబిజి అయితే అందరూ పిచ్చోళ్లయినట్టా?

బాబూ... మీ మైండ్ గజిబిజి అయితే అందరూ పిచ్చోళ్లయినట్టా?

అంతేకాదు మూడు రాజధానులు విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడిన విజయసాయిరెడ్డి ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబూ? 3 రాజధానులు కావాలంటే మళ్ళీ ప్రజాతీర్పు కోరాలా? గెలిచినా రాజధానిపై నిర్ణయాధికారం ఉండదా? అంటూ ప్రశ్నించారు. ఇంత అయోమయం, అహంకారం ఎందుకు? అని చంద్రబాబుని టార్గెట్ చేసిన ఆయన మీ మైండ్ గజిబిజి అయితే అందరూ పిచ్చోళ్లయినట్టా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ముందే చేతులెత్తేసి, గుక్కపట్టి ఏడిస్తే సానుభూతి రాదు అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

చంద్రబాబు.. కౌన్సిల్‌లో తాళిబొట్లు ప్రదర్శనతో ఏం సందేశమిస్తున్నావు?

చంద్రబాబు.. కౌన్సిల్‌లో తాళిబొట్లు ప్రదర్శనతో ఏం సందేశమిస్తున్నావు?


ఇక ఈరోజు శాసనమండలిలో తాళిబొట్ల ప్రదర్శన నిర్వహించి నిరసన తెలియజేసిన టిడిపి సభ్యుల తీరుపై విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబూ...కౌన్సిల్‌లో తాళిబొట్లు ప్రదర్శనతో ఏం సందేశమిస్తున్నావు? అంటూ ప్రశ్నించారు. స్త్రీ తన తాళిబొట్టును ఎంత పవిత్రంగా భావిస్తుందో కూడా తెలియదా? ఇది మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచడం కాదా? అని నిలదీశారు. అధికారం పోయినా మీకు అహంకారం పోలేదు. మీకు ఓట్లు వేయలేదన్న కక్షతో తాళిబొట్ల డ్రామాతో మహిళలను అవమానపరుస్తారా? అని విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు.

దొంగ తానే అయినా కెలికి మరీ.. చంద్రబాబుకు దిక్కు తోచడం లేదు పాపం

దొంగ తానే అయినా కెలికి మరీ.. చంద్రబాబుకు దిక్కు తోచడం లేదు పాపం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జై బ్రాండ్ మద్యం అంటూ, మద్యం పై చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తూ నిత్యం అసెంబ్లీ లో రచ్చ చేస్తున్న టిడిపి నాయకులను ఉద్దేశించి విజయ సాయి రెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు, భజన మీడియా కాలంచెల్లిన మైండ్‌సెట్‌తో అక్కడే గిరికీలు కొడుతున్నారు అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. 2004లో 'అలిపిరి దాడి'పై ఆశ పెట్టుకుంటే ఏం జరిగింది? 2019లో పసుపు, కుంకుమలే రంగు వెలిసిపోయేలా చేశాయి. దొంగ తానే అయినా కెలికి మరీ లిక్కర్ బ్రాండ్ల లోగుట్టు బైట పెట్టించుకున్నారు. దిక్కు తోచడం లేదు పాపం! అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబు పై లిక్కర్ బ్రాండ్ల దొంగ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+