అండమాన్ జైలులో విజయసాయి రెడ్డి: ఆ సెల్‌‌లో..!

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరో రిస్కీ ఫీట్ చేశారు. ప్రస్తుతం ఆయన అండమాన్ నికోబార్‌లో విహరిస్తోన్నారు. రాజకీయాల నుంచి కొంత విరామం తీసుకున్న ఆయన అండమాన్ సముద్ర తీర ప్రాంతంలో సాహసకృత్యాలు చేస్తోన్నారు. తన అండమాన్ పర్యటనను అడ్వెంచర్ టూరిజంగా మార్చుకున్నారు. రాజకీయలు, ఎత్తుకు పైఎత్తులు, వ్యూహ-ప్రతివ్యూహాలతో రోజూ తీరిక లేకుండా గడిపే సాయిరెడ్డి వాటన్నింటినీ పక్కన పెట్టారు. ఉల్లాసంగా గడుపుతున్నారు.

చంద్రబాబు.. రఘురామ

చంద్రబాబు.. రఘురామ

మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. తన కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లొచ్చారు. సుమారు వారం రోజుల పాటు అక్కడ విహరించారు. కొద్దిరోజుల కిందటే- వైఎస్ఆర్సీపీకే చెందిన తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు కూడా జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించారు. గుల్‌మార్గ్‌లో విహరించారాయన. ఈ శీతాకాలంలో ఆయన గుల్‌మార్గ్‌లో గడిపారు. మైనస్ డిగ్రీల టెంపరేచర్ గల వాతావరణంలో ఎంజాయ్ చేశారు.

 స్కూబా డైవింగ్‌తో..

స్కూబా డైవింగ్‌తో..

గుల్‌మార్గ్‌ మంచుకొండల మధ్య విహరించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. వైరల్‌గా మారాయి. ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి.. అండమాన్‌లో సాహసకృత్యాలు చేస్తోన్నారు. సముద్రంలో స్కూబా డైవింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. 64 సంవత్సరాల వయస్సులో ఆయన సముద్రంలో గడిపారు. ఉపరితలం నుంచి సుమారు 12 మీటర్ల పాటు ఆయన సముద్ర గర్భంలోకి వెళ్లారు. కొన్ని నిమిషాలు అక్కడే గడిపారు.

పారా సెయిలింగ్‌తో సందడి..

పారా సెయిలింగ్‌తో సందడి..

అనంతరం పారా సెయిలింగ్ చేశారు. గంటకు 40 నాటికల్స్ మైళ్ల వేగంతో వెళ్లే స్పీడ్‌బోట్‌కు అమర్చిన పారాచూట్ ద్వారా కొన్ని మీటర్ల ఎత్తున ఆయన గాల్లోకి ఎగిరారు. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మీద పోస్ట్ చేశారు. అండమాన్‌ పర్యటన ఓ అనిర్వచనీయమైన అనుభూతిని మిగిలిస్తుందంటూ చెప్పుకొచ్చారు. అండమాన్‌లో చూడాల్సింది.. నేర్చుకోవాల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించారు

చారిత్రాత్మక అండమాన్ జైలులో..

చారిత్రాత్మక అండమాన్ జైలులో..

తన పర్యటనలో భాగంగా సాయిరెడ్డి చారిత్రాత్మక అండమాన్ కేంద్ర కారాగాన్ని సందర్శించారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గన్న వారిని రాజకీయ ఖైదీలుగా బంధించిన బ్రిటీషర్లు.. వారిని అండమాన్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు వీర్ సావర్కర్ కూడా అక్కడే సుదీర్ఘకాలం పాటు కారాగార శిక్షను అనుభవించారు. అండమాన్ జైలుకు వెళ్లడం అంటే నరకానికి వెళ్లినట్టే ఉంటుందనే అభిప్రాయాలు ఇప్పటికీ వ్యక్తమౌతుంటాయి.

 వీర్ సావర్కర్ శిక్షను అనుభవించిన సెల్‌లో..

వీర్ సావర్కర్ శిక్షను అనుభవించిన సెల్‌లో..

ఈ కారాగారాన్ని విజయసాయి రెడ్డి సందర్శించారు. వీర్ సావర్కర్‌ను బంధించిన సెల్‌ను కొద్దిసేపు గడిపారు. వీర్ సావర్కర్.. కొన్ని సంవత్సరాల పాటు అదే సెల్‌గా శిక్షను అనుభవించారు. స్థానిక అధికారులను ఆ కారాగారం ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. సెల్‌లో కలియ తిరిగారు. అక్కడ ఉంచిన వీర్ సావర్కర్ ఫొటోలకు నివాళి అర్పించారు. ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. సావర్కర్ చిత్రపటం వద్ద నేలపై కూర్చుని.. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. శ్రద్ధాంజలి ఘటించారు.

రాస్ ఐలండ్‌లో..

రాస్ ఐలండ్‌లో..

అనంతరం రాస్ ఐలండ్‌లో పర్యటించారు. అండమాన్ నికోబార్ దీవుల్లో భాగమైన ఐలండ్ ఇది. దీనికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలండ్‌గా కేంద్ర ప్రభుత్వం పేరు మార్చింది. బ్రిటీషర్ల పరిపాలనలో ఉన్న సమయంలో దీన్ని పీనల్ కాలనీగా పిలిచేవారు. ప్రకృతి అందాలన్నీ ఒక్కచోటే పోత పోసినట్టుగా ఉంటుందీ ఐలండ్. ప్రతి సంవత్సరం లక్షలాదిమంది పర్యాటకులు దీన్ని సందర్శిస్తుంటారు. ఇప్పుడు అదే ద్వీపాన్ని విజయసాయి రెడ్డి సందర్శించారు. ప్రకృతితో మమేకం అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+