సముద్రం ఒకరి కాళ్ల దగ్గర కూర్చొని మొరగదన్న పవన్ ..మోదీ కాళ్లపై ఎలా పడ్డరబ్బా..!
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. పోలింగ్‌కు మరో వారం రోజులు మాత్రమే ఉండటంతో పార్టీల అధినేతలు కాళ్లకు బలపం కట్టుకుని మరీ రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ..ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఏపీలో కూటమి అభ్యర్థులుగా మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
రాజమండ్రిలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వేదికపై వచ్చిన ప్రధానికి ముందుగా బీజేపీ ముఖ్యనేతలు, టీడీపీ నేత నారా లోకేష్ శాలువా కప్పి స్వాగతం పలికారు. ఆ తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రధానికి సాదర స్వాగతం పలికారు. అయితే ఇక్కడ ఎవరూ ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రధాని మోదీ కాళ్లకు పవన్ కల్యాణ్ నమస్కరించారు.

వద్దని వారించినప్పటికి వినకుండా మోదీ కాళ్లపై పవన్ పడ్డారు. ఈ ఘటనపై కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దేశ ప్రధాని కావడంతోనే మోదీ కాళ్లు మొక్కారని కొందరు అభిప్రాయడుతుంటే..ఇలా చేయడం నిజంగా అవమానమే అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ ప్రధాని కాళ్లపై పడటాన్ని ఆయన అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.
మోదీ కాళ్లపై పడ్డ పవన్.. ప్రధాని రియాక్షన్ ఇదే..!#PMModi #NarendraModi #PawanKalyan #Rajahmundry #TDPJSPBJPTogether #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/bbZYcKxeMw
— oneindiatelugu (@oneindiatelugu) May 6, 2024
ఈ ఘటనపై వైసీపీ శ్రేణులు ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు. సముద్రం ఒకరి కాళ్ల దగ్గర కూర్చొని మొరగదన్న పవన్ ..ఇప్పుడు మోదీ కాళ్లపై ఎలా పడ్డారని వైసీపీ నాయకులు ఎద్దెవా చేస్తున్నారు. గతంలో పవన్ కల్యాణ్ మాట్లాడిన వీడియోలకు ఈ వీడియోను జత చేసి మరీ జనసేన అధినేతను విమర్శిస్తున్నారు. దీనిపై జనసేన నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications