YS Jagan, Rakhi : జగన్ ఇంట్లో రాఖీ సందడి- రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు, మంత్రులు

ఏపీలో వైసీపీ ప్రభుత్వాధినేత, సీఎం జగన్ కు ఇవాళ రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని వైసీపీ మహిళా నేతలు రాఖీలు కట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ఉదయం వచ్చిన వైసీపీ నేతలు, మహిళా మంత్రులు తానేటి వనిత, విడదల రజనీ, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి వద్మ.. జగన్ కు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.

ysrcp women leaders including minister rajani, vasireddy padma tied rakhi to cm ys jagan

రక్షాబంధన్‌ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్‌ జగన్‌కు ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ జీ, సిస్టర్స్‌ పద్మజ, మానస రాఖీలు కట్టారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సెప్టెంబర్‌లో మౌంట్‌ అబూలో జరిగే గ్లోబల్‌ సమ్మిట్‌కు ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా వారు ఆహ్వనించారు.

ysrcp women leaders including minister rajani, vasireddy padma tied rakhi to cm ys jagan

అనంతరం వైసీపీ మహిళా మంత్రులు తానేటి వనిత, విడదల రజనీతో పాటు పలువురు వైసీపీ మహిళా నేతలు తరలివచ్చారు.

ysrcp women leaders including minister rajani, vasireddy padma tied rakhi to cm ys jagan

హోంమంత్రి తానేటి వనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, మహిళా కమీషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్‌ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ సీఎం జగన్ కు వేర్వేరుగా రాఖీలు కట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+