బెంగళూరులో భారీ మొత్తంలో నగదు, బంగారంతో చిక్కిపోయిన ఆంధ్రా యువకుడు, ఐటీ శాఖ ఎంట్రీ?
బెంగళూరు/తిరుపతి: బెంగళూరులోని సిటీ మార్కెట్‌లో అనుమానాస్పదంగా ఓబ్యాగ్‌తో తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అక్షయ్ అనే వ్యక్తి భారీ మొత్తంలో డబ్బు, బంగారంతో పట్టుబడ్డాడు. కేఆర్ మార్కెట్ సమీపంలోని గ్రీన్ బజార్ లో వెలుతున్న అక్షయ్ దగ్గర డబ్బు, బంగారం, వెండి లభ్యమయ్యాయి. వెంటనే పోలీసులు అక్షయ్ ని అదుపులోకి తీసుకుని విచారించారు.

ఒక్క ఆధారం కూడా లేదు
బెంగళూరు సిటీ మార్కెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అక్షయ్ అనే వ్యక్తి వద్ద ఎలాంటి పత్రాలు లేకుండా భారీ మొత్తం డబ్బులు, బంగారంతో పోలీసులకు చిక్కిపోయాడు. అక్షయ్ దగ్గర ఉన్న బ్యాగ్ లో రూ. 28 లక్షల నగదు, రూ. 20 లక్షల విలువైన 319 గ్రాముల బంగారం, 10 లక్షల విలువైన 15 కిలోల విలువైన వెండి దొరికిందని పోలీసులు చెప్పారు.
నగల దుకాణంలో డబ్బులు, బంగారం ఇవ్వడానికి వచ్చానని అక్షయ్ వాంగ్మూలాన్ని ఇచ్చాడని పోలీసులు తెలిపారు, అసెంబ్లీ ఎన్నికల ముందు పత్రాలు లేకుండా వ్యాపారం చేస్తున్న ఓ తిమ్మింగలం చిక్కడంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.

ఐటీ శాఖకు సమాచారం
అక్షయ్ బ్యాగును తనిఖీ చేయగా రూ. 28 లక్షలు, 319 గ్రాముల బంగారం, 15 కిలోల వెండి చిక్కిందని, వాటికి సంబంధించి ఎలాంటి పత్రాలు లభించలేదని, అక్షయ్‌ను బీట్ పోలీసులు సిటీ మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారని పోలీసు అధికారులు అంటున్నారు.
అనంతరం ఈ విషయాన్ని ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులకు తెలియజేశామని పోలీసు అధికారులు తెలిపారు. డబ్బు, బంగారానికి సంబంధించిన పత్రాలు అడుగుతున్నారని, దీనిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారని సిటీ మార్కెట్ పోలీసులు తెలిపారు.

జాగ్రత్తగా ఉంటే అందరికి మంచింది
కర్ణాటకలో అసెంబ్లీఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కొన్ని ఆదేశాలు జారీ చేసిందని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి మీడియాకు చెప్పారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే అలర్ట్ ప్రకటించామని, అత్యాశలకు, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని, అందుకోసం చెక్‌పోస్టులు పెట్టామని ప్రతాప్ రెడ్డి వివరించారు. రౌడీషీటర్ల మీద డేగకన్ను వేశామని, అన్ని రకాల బందో బస్త్‌లు చేపడుతున్నామని బెంగళూరు సిటీ పోలీసు కమీనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications