ATM: టార్గెట్ ఏటీఎం సెంటర్స్, అమాయకులు కనపడితే అంతే సంగతి, వీడు ఏం చేశాడంటే?

బెంగళూరు/చిక్కబళ్లాపురం: ఏటీఎం కార్డులు వచ్చిన తరువాత బ్యాంకులకు వెళ్లి నగదు డ్రా చేసుకోవడం దాదాపుగా తగ్గిపోయింది. ఈరోజు ప్రతి ఒక్కరు ఏటీఎం కార్డులు ఉపయోగిస్తున్నారు. ఈ మద్యకాలంలో ఏటీఎం సెంటర్లలో మోసాలు ఎక్కువ అయ్యాయి. అమాయకును టార్గెట్ చేసుకుని ఓ యువకుడు ఎలా మోసాలు చేస్తున్నాడు అని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

కర్ణాటకలోని చిక్కబళ్లాపురంలోని ఏటీఎం కేంద్రంలో ఓ అమాయకుడు నగదు డ్రా చేసుకోవడానికి వెళ్లాడు. ఆ సందర్బంలో మైసూరుకు చెందిన కిరణ్ కుమార్ (32) అనే యువకుడు ఏటీఎం కేంద్రం దగ్గర ఉన్నాడు. సార్ డబ్బులు డ్రా చేసుకోవడం తెలీదు. కొంచెం డబ్బులు డ్రా చెయ్యండి అని అతను కిరణ్ కుమార్ కు చెప్పాడు.

ATM: Thief arrested for stealing money by changing ATM card at Chikkaballapur in Karnataka

డబ్బులు డ్రా చేసి అతనికి ఇచ్చిన కిరణ్ కుమార్ అమాయకుడి ఏటీఎం కార్డు మార్చేశాడు. తరువాత అమాయకుడి ఏటీఎం కార్డు పిన్ నెంబర్ తెలుసుకుని అతని బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేశాడు. మొబైల్ నెంబర్ కు మెసేజ్ రావడం, బంధువుకు ఆ మెసేజ్ చూపించిన అమాయకుడు పోలీసులను ఆశ్రయించాడు.

మైసురుకు చెందిన కిరణ్ కుమార్ ను. పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కిరణ్ కుమార్ నుంచి 18 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కిరణ్ కుమార్ కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలను టార్గెట్ చేసుకుని ఏటీఎం కేంద్రాల దగ్గర ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాడని చిక్కబళ్లాపురం పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+