ప్రియురాలి పెళ్లి, కల్యాణమండపంలోకి వెళ్లి గొంతు కోసుకున్న ప్రియుడు, పెళ్లి జరిగిందా? లేదా?
పెళ్లి జరుగుతున్న కల్యాణమండపంలోకి వెళ్లి తాళి కట్టించుకోవడానికి సిద్దంగా ఉన్న ప్రియురాలి ఎదుటే ఆమె ప్రియుడు గొంతు కోసుకున్నాడు.
బెంగళూరు/ఘాటి సుబ్రమణ్య: ప్రేమించుకున్న అమ్మాయి అయినా, అబ్బాయి అయినా వాళ్లు మాకు సొంతం కావాలని అనుకుంటారు. అయితే ప్రేమ విఫలం అయితే ప్రేమికులు ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తున్నాము.
ఇక్కడ ఓ పిచ్చి ప్రేమికుడు అతను ప్రేమించిన అమ్మాయి అతని ప్రేమను తిరస్కరించి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి కల్యామణమండపంలోకి వెళ్లడం తట్టుకోలేకపోయాడు. పెళ్లి జరుగుతున్న కల్యాణమండపంలోకి వెళ్లి తాళి కట్టించుకోవడానికి సిద్దంగా ఉన్న ప్రియురాలి ఎదుటే ఆమె ప్రియుడు గొంతు కోసుకున్నాడు.

కల్యాణమండపంలో గొడవ చేసిన ప్రియుడు
బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దొడ్డ బళ్లాపూరం సమీపంలోని శ్రీ ఘాటి సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం ఆవరణంలోని కల్యాణమంటపంలోకి బెంగళూరుకు చెందిన నితీష్ అనే యువకుడు వెళ్లాడు. తాను ప్రేమించిన అమ్మాయిని తనకే ఇచ్చి పెళ్లి చెయ్యాలని నితీష్ అక్కడ గొడవ చేశాడు.
ఆ సందర్బంలో రచ్చరచ్చ అయ్యింది. కల్యాణ మండపానికి వచ్చి పెళ్లి ఆపాలని గొడవ చేసిన నితీష్ ను అమ్మాయి కుటుంబ సభ్యులు చితకబాది అతన్ని హాలులో నుండి బయటకు తరిమేశారు.

స్పాట్ లో గొంతు కోసుకున్న యువకుడు
కల్యాణమండపం ముందే కత్తి తీసుకున్న నితీష్ అతని గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. రక్తపు మడుగులో పడి ఉన్న నితీష్ ను వెంటనే చికిత్స నిమిత్తం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అంత వరకు కోలాహలంగా ఉన్న కల్యాణ మండపం మూగబోయింది.
హ్యాపీగా జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులు ,బంధువులు, స్నేహితులు అందరూ కల్యాణమండపం ఖాళీ చేసి వెళ్లిపోయారు. దొడ్డబళ్లాపూర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.

బెంగళూరులో ప్రియుడి మీద కేసు
ఈ సంఘటన గురించి బెంగళూరు రూరల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మల్లికార్జున్ మీడియాతో మాట్లాడుతూ యువతికి ఈరోజు పెళ్లి జరగాల్సి ఉందని తెలిపారు. కల్యాణ మండపంలో వధూవరులు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నితీష్ అక్కడికి వెళ్లి హంగామా చేశాడని వివరించారు. నిందితుడు నితీష్ చాలా రోజులుగా యువతి వెంటపడుతున్నాడని వివరించారు.

పోలీసులు వార్నింగ్ ఇచ్చినా వినలేదు
ఇద్దరూ బెంగళూరు నగర వాసులు అతని వివరించారు. యువతి జేజే నగర్ పోలీస్ స్టేషన్‌లో నితీష్ మీద ఫిర్యాదు కూడా చేసిందని, ఇంతకు ముందే పోలీసులు ఒక్కసారి నితీష్ కు ఫోన్ చేసి హెచ్చరించారని. నిన్న మళ్లీ కల్యాణ మండపం వద్దకు వచ్చి గొడవ చేశాడని, ఆ కోణంలో విచారణ కొనసాగుతోందని బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ మల్లికార్జున్ తెలిపారు.












Click it and Unblock the Notifications