నా భార్య రోజుకు 20 గంటలు నిద్రపోతుంది, ఖర్మకాలి పెళ్లి చేసుకున్నా, కేసు పెట్టిన భర్త, రక్షించండి సార్!
తన భార్య రాత్రి పడుకుని మరుసటి రోజు మధ్యాహ్నం నిద్ర లేస్తుంది. గత ఐదేళ్లుగా తాను నరకం అనుభవిస్తున్నానని, తన భార్య మీద చర్యలు తీసుకోవాలని భర్త కేసు పెట్టాడు.
బెంగళూరు: తన భార్య రాత్రి పడుకుని మరుసటి రోజు మధ్యాహ్నం నిద్ర లేస్తుంది. గత ఐదేళ్లుగా తాను నరకం అనుభవిస్తున్నానని, తన భార్య, ఆమె కుటుంబ సభ్యులపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని భర్త బెంగళూరులో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యలాగా నిద్రపోయే మనుషులను తాను ఇంతవరకు చూడలేదని, అందరూ బతకడానికి నిద్రపోతే తన భార్య నిద్రపోవడానికి బతుకుందోని, ఏమైనా మాట్లాడితే నిన్ను చంపిస్తాను అని తనకే వార్నింగ్ ఇస్తోందని భర్త లవోబిదో అంటున్నాడు.

భార్య, ఫ్యామిలీ మీద కేసు
బెంగళూరులోని బసవనగుడి సమీపంలో నివాసం ఉంటున్న వాసీమ్ కమ్రాన్ ఖాన్ అలియాస్ వాసీమ్ (39) అనే వ్యక్తి అతని భార్య అయేషా ఫరీన్, అతని బావ ఆరిఫ్ పాషా, అత్తగారు హీనా కౌసర్, బావమరిది మహ్మద్ మొయిన్ లమీద బసవనగుడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని బసవనగుడివ పోలీసు అధికారులు తెలిపారు.

నా ఖర్మకొద్ది పెళ్లి చేసుకున్నాను
బసవనగుడి సమీపంలోని ఇలియాజ్ నగర్‌కు చెందిన అయేషా ఫరీన్‌తో 2017లో ఇస్లాం మతం సాంప్రధాయాల ప్రకారం వివాహం తనకు వివాహం అయ్యిందని వాసీమ్ అంటున్నాడు. తనకు అనారోగ్యంగా ఉందని నా భార్య రాత్రి నిద్రపోతే, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు నిద్ర లేస్తుంది. ఆమెకు టైఫాయిడ్, థైరాయిడ్, కంటిచూపు సంబంధిత వ్యాధులు ఉన్నాయని, పెళ్లి సమయంలో నాకు ఈ విషయా తెలీకుండా మోసం చేసి పెళ్లి చేశారని వాసీమ్ ఆరోపిస్తున్నాడు.

నిద్రపోయేదానికే నా భార్య బతుకుతోంది
నేను ఆఫీసుకు వెళ్లినప్పుడు మా అమ్మ రోజూ వంట చేస్తుంది. మధ్యాహ్నం నిద్ర నుంచి లేస్తున్న తన భార్య ఆయేషా సాయంత్రం వరకు టైమ్ పాస్ చేసి తరువాత మళ్లీ సాయంత్రం 5 గంటలకు నిద్రపోతుంది. తన భార్య ఆయేషా రాత్రి 9.30 గంటలకు నిద్ర లేచి భోజనం చేసి మళ్లీ నిద్రపోతుందని, తరువాత మరుసటి రోజు మద్యాహ్నం 12 గంటల తరువాతే నిద్రలేని రూమ్ లో నుంచి బయటకు వస్తోందని వాసీమ్ పోలీసులకు చెప్పాడు.

నా భార్య చెప్పిన మాట వినదు... 25 మంది దాడి చేశారు
అయేషా తనకు ఆరోగ్యం బాగోలేదని, పుట్టింటికి వెళ్లిపోతానని చెప్పింది. హాస్పిటల్ కి తీసుకెళ్తానని కూడా అడిగాను. నువ్వు నన్ను బాగా చూసుకోవడం లేదు. నా కుటుంబం గురించి నీకు తెలియదని తన భార్య ఆయేషా తనను బెదిరించిందని, పుట్టికి వెళ్లి 20 రోజులైనా తిరిగి రాలేదు. అని చెప్పాడు.
గత అక్టోబరు 6వ తేదీన ఆయేషా పుట్టింటి వెలుతాను అని అడిగిందని, అందుకు తాను అంగీకరించకపోవడంతో ఆ రోజు రాత్రి ఆమె తన ఇంటికి దాదాపు 25 మంది బంధువులను పిలిపించి నాపై, నా కుటుంబ సభ్యులపై దాడి చేసిందని, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారని వాసీమ్ వాపోయాడు.

ఆస్తి కోసం పెళ్లి చేసుకుంది
తాను ఎదైనా గట్టిగా మాట్లాడదితే నీమీద, మీ కుటుంబ సభ్యుల మీద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని తన భార్య ఆయేషా బెదిరించిందని, నా దగ్గర ఉన్న డబ్బు, ఆస్తులు లాక్కోవాలనే ఉద్దేశంతో నన్ను పెళ్లి చేసుకుందని, ఆమె లగ్జరీలైఫ్ గడపడానికి ఆలోచిస్తుందని ఆమె భర్త వాసీమ్ ఆరోపించాడు. నా భార్య ఆయేషాకు నాపై కనికరం, ప్రేమ లేదు.
నా దగ్గర డబ్బులు దండుకోవాలనే దురుద్దేశంతో ఆమె కుటుంబీకులు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేశారని, నా భార్య, ఆమె కుటుంబ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు వాసీమ్ బెంగళూరులోని బసవనగుడి పోలీసులు కేసు పెట్టాడు.












Click it and Unblock the Notifications