Coronavirus: సీఎంకు కరోనా, నేడు కూతురికి పాజిటివ్, కొడుకు క్వారంటైన్, బల్లాల్ క్లారిటీ !
బెంగళూరు/ శివమొగ్గ: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఇప్పటికే కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ తో బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప కుమార్తెకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. సీఎం బీఎస్. యడియూరప్ప కొడుకు విజయేంద్రకు నెగటివ్ వచ్చినా ఆయన క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. కొడుకు కీలక పదవి వచ్చిందని సంతోషంలో ఉన్న సీఎంకు వెంటవెంటనే రెండు షాకింగ్ విషయాలు తెలియడంతో ఓ పక్క సంతోషం, మరో పక్క బాధతో ఆయన తల్లడిల్లిపోతున్నారు.
Recommended Video

సీఎంకు సినిమా కష్టాలు
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కరోనా వైరస్ కట్టడికి శక్తివంచనలేకుండా పని చేస్తున్నారు. కరోనా కట్టడి కోసం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప తీసుకుంటున్న చర్యలను స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖ మెచ్చుకుంది. సీఎం బీఎస్. యడియూరప్ప ప్రతిరోజు మంత్రులు, అధికారులతో కరోనా వైరస్ కట్టడి కోసం సీఎం బీఎస్. యడియూరప్ప చర్చిస్తున్నారు. ఈ సందర్బంలో సీఎం బీఎస్. యడియూరప్పకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది.

సీఎం కుమార్తెకు కరోనా పాజిటివ్
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసిన వెంటనే వైద్యుల సలహామేరకు ఆయన్ను బెంగళూరు సిటీలోని పాత ఎయిర్ పోర్టు (HAL) రోడ్డులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వార్డులో వైద్యపరీక్షలు చేస్తున్నారు. ఇదే సమయంలో సీఎంకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసి 24 గంటలు పూర్తి కాకముందే బీఎస్. యడియూరప్ప కుమార్తె బీఎస్. అరుణా దేవికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో వారి కుటుంబ సభ్యులు హడలిపోయారు.

సీఎం కూతురు, కొడుకు క్వారంటైన్
బీఎస్. యడియూరప్పకు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు సీఎం బీఎస్. యడియూరప్ప కుమార్తె బీఎస్. అరుణా దేవిని మణిపాల్ ఆసుపత్రికి తరలించి ఆమెకు ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఇక సీఎం కొడుకు, బీజేపీ నాయకుడు బీఎస్. విజేయంద్ర సైతం సోమవారం క్వారంటైన్ కు వెళ్లిపోయారు. సీఎం కొడుకు బీఎస్. విజేంద్రకు కరోనా నెగటివ్ వచ్చినా ముందు జాగ్రత్తగా ఆయన 7 రోజలు క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించారని సీఎం బీఎస్. యడియూరప్ప సన్నిహిత వర్గాలు తెలిపాయి.

సీఎం ఆరోగ్యంపై బల్లాల్ క్లారిటీ
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన చికిత్సకు పూర్తిగా సహకరిస్తున్నారని మణిపాల్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ సుదర్శన్ బల్లాల్ సోమవారం మీడియాకు చెప్పారు. ఇదే సమయంలో ఇంతకాలం తనతో టచ్ లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నాయకులు అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సూచనమేరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మనవి చేశారు.

సీఎంకు ఓపక్క సంతోషం... మరో పక్క ?
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు ఓ పక్క సంతోషం, మరో పక్క బాధ. ఎందుకంటే బీఎస్. యడియూరప్ప ముద్దుల కుమారుడు బీఎస్. విజేయంద్రకు బీజేపీ ఉపాద్యక్షుడి పదవి వరించింది. తన కుమారుడు బీఎస్. విజయేంద్రకు కీలక పదవి చిక్కిందని సంతోషంగా ఉన్న బీఎస్. యడియూరప్పకు కరోనా పాజిటివ్ రావడం, మరుసటి రోజు కుమార్తె బీఎస్. అరుణా దేవికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన బాధ వర్ణనాతీతం అయ్యింది.












Click it and Unblock the Notifications