బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

DJ Party: శోభనం రోజు చరిత్రలో మిగిలిపోవాలని పెళ్లి కొడుకు ఏం చేశాడంటే ?. దోమలు, చీమలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మంగళూరు: పెళ్లి చేసుకుంటున్నాననే సంబరంతో ఓ యువకుడు చిందులు వేశాడు. కోవిడ్ నియమాలు పాటించి పెళ్లి జరిపిస్తామని పెద్దలు అధికారుల దగ్గర అనుమతి తీసుకున్నారు. పెళ్లి సింపుల్ గా జరిగిపోయింది. నియమాలు ఉల్లంఘించిన అధికారులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. అయితే తన శోభనం రోజు జీవితంలో అందరికి గుర్తుండిపోవాలని, ఆ రోజు తన చరిత్రలో మగిలిపోవాలని తిక్క ఆలోచనతో పెళ్లి కొడుకు ఓ పనికిరాని పని చేశాడు. ఓ పక్క శోభనం గదిని అలంకరిస్తుంటే పెళ్లి కొడుకుకు చెందిన విలాసవంతమైన భవనంలో డీజే పార్టీ జరిగింది. రాత్రి శోభనం జరిగినా మరుసటి రోజు పోలీసులు పెళ్లి కొడుక్కి త్రీడి సినిమా చూపించారు. పెళ్లి చేసుకుని ఎంజాయ్ చెయ్యాల్సిన పెళ్లి కొడుకు ఇప్పుడు జైల్లో కుర్చుకుని దోమలు, చీటీగలు, చీమలు చంపుకుంటున్నాడు.

Bhabhi: వదిన మీద మోజు, నాజూకుగా ఉందని కసితీరా ఎంజాయ్, పుట్టింటికి వెళితే ?, మెడ చెక్కేసి !Bhabhi: వదిన మీద మోజు, నాజూకుగా ఉందని కసితీరా ఎంజాయ్, పుట్టింటికి వెళితే ?, మెడ చెక్కేసి !

ఆ రాష్ట్రం పక్క రాష్ట్రం పోటీ ?

ఆ రాష్ట్రం పక్క రాష్ట్రం పోటీ ?

కర్ణాటకలో కరోనా వైరస్ (COVID-19) పాజిటివ్ కేసులకు స్పీడ్ బ్రేక్ లు లేకుండా పోయాయి. మహారాష్ట్రతో పోటీ పడుతున్న కర్ణాటకలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేసినా అంతంత మాత్రంగానే కరోనా పాజిటివ్ కేసులు కట్టడి అవుతున్నాయి.

కరోనా కాలంలో పెళ్లిళ్లకు ఓకే

కరోనా కాలంలో పెళ్లిళ్లకు ఓకే

కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న సమయంలో కూడా సింపుల్ గా పెళ్లిళ్లు చేసుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులోని దామోదర్ శెట్టిగార్ ముందుగా అనుకున్న ముహూర్తానికి ఆయన కొడుకు రంజిత్ పెళ్లి జరిపించడానికి సర్వం సిద్దం చేసుకున్నారు. కేవలం 25 మంది సమక్షంలో రంజిత్ పెళ్లి చెయ్యడానికి అడ్యార్ పంచాయితీ అధికారులు దామోదర్ శెట్టికి అనుమతి ఇచ్చారు.

 పెళ్లి వరకు అంతా ఓకే

పెళ్లి వరకు అంతా ఓకే

కల్యాణమండపంలో రంజిత్ పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోయింది. అధికారులు 25 మంది మాత్రమే పెళ్లికి హాజరుకావాలని చెప్పినా అంతకంటే ఎక్కువ మందే పెళ్లికి హాజరైనారు. అయితే అధికారులు మాత్రం దామోదర్ శెట్టి ముఖం చూసి చూసిచూడనట్లు వాళ్లను వదిలేశారు. కల్యాణమండపంలో పెళ్లి ముగించుకుని అందరూ పెళ్లి కొడుకు ఇంటికి వెళ్లిపోయారు.

వీడి శోభనం చరిత్రలో నిలిచిపోవాలని ?

వీడి శోభనం చరిత్రలో నిలిచిపోవాలని ?

పెళ్లి కొడుకు రంజిత్ కొంచెం కాదు చాలానే తీట ఎక్కువ అని సమాచారం. పెళ్లి రోజు రాత్రి పెళ్లి కొడుకు ఇంట్లో డీజే పార్టీ ఏర్పాటు చేశారు. ఇంట్లో శుభకార్యం జరగడంతో అధికారులు, పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఓ పక్క శోభనం కోసం రూమ్ చక్కగా అలంకరిస్తున్నారు. మరో వైపు విలాసవంతమైన ఇంట్లో పెళ్లి కొడుకు రంజిత్ అతని ఫ్రెండ్స్ కోసం డీజే పార్టీ ఏర్పాటు చేశాడు. తన శోభనం రోజు చరిత్రలో నిలిచిపోవాలని రంజిత్ తిక్కతిక్క ప్లాన్ లు వేశాడు.

రాత్రి అదిరిపోయింది... ఉదయం తడిసిపోయింది

రాత్రి అదిరిపోయింది... ఉదయం తడిసిపోయింది

రాత్రి రంజిత్ ఇంట్లో డీజేపీ పార్టీ ఏర్పాటు చెయ్యడంతో వయసులో ఉన్న అతని బంధువులు, స్నేహితులు పిచ్చపాటిగా మద్యం సేవించి ఎంజాయ్ చేశారు. రంజిత్ శోభనం కూడా అదే రోజు రాత్రి జరిగిపోయింది. రాత్రి పొద్దుపోయే వరకు రంజిత్ ఇంట్లో డీజే పార్టీ దెబ్బతో రచ్చరచ్చ అయ్యింది. రంజిత్ ఇంట్లో రాత్రి జరిగిన డీజేపీ పార్టీ వీడియోలు మరుసటి రోజు ఉదయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దెబ్బతో పెళ్లి కొడుకు రంజిత్ పంచి ఊడిపోయింది.

జిల్లా కలెక్టర్ ఎంట్రీతో సీన్ రివర్స్

జిల్లా కలెక్టర్ ఎంట్రీతో సీన్ రివర్స్

కోవిడ్ నియమాలు ఉల్లంఘించి అంటురోగాలు వ్యాపించడానికి కారణం అయ్యారంటూ ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ రాజేంద్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్థానిక పంచాయితీ అధికారి క్రిష్ణ నాయక్ కు ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ నియమాలు ఉల్లంఘించి రంజిత్ ఇంట్లో అర్దరాత్రి దాటే వరకు డీజే పార్టీ జరిగిందని, అంటు వ్యాదులు వ్యాపించడానికి ఆ పార్టీ కారణం అయ్యిందని పంచాయితీ అధికారి క్రిష్ణనాయక్ కలెక్టర్ రాజేంద్రకు నివేదిక సమర్పించారు.

ఒక్కరోజు మాత్రమే శోభనం... అరెస్టు

ఒక్కరోజు మాత్రమే శోభనం... అరెస్టు

కోవిడ్ నియమాలు పాటించి కేవలం 25 మంది సమక్షంలో మాత్రమే పెళ్లి చేసుకోవాలని మేము అనుమతి ఇచ్చామని, డీజే పార్టీకి మా అనుమతి లేదని పంచాయితీ అధికారులు నివేదిక ఇచ్చారు. కలెక్టర్ డాక్టర్ రాజేంద్ర ఆదేశాల మేరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చి పెళ్లి కొడుకు రంజిత్ ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

పెళ్లి కొడుక్కి దోమలు, చీమలు ?

పెళ్లి కొడుక్కి దోమలు, చీమలు ?


శోభనం జరిగిన మరుసటి రోజు అరెస్టు కావడంతో పెళ్లి కొడుకు రంజిత్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ సెల్ లో దోమలు, చీమలు చంపుకుంటూ కాలం గడుపుతున్నారు. ఎఫ్ఐఆర్ కు పోలీసులు రంజిత్ ఇంట్లో జరిగిన డీజే పార్టీ వీడియో జత చెయ్యడంతో పెళ్లి కొడుక్కి అంత సామాన్యంగా బెయిల్ వచ్చే అవకాశం లేదని తెలిసింది. మొత్తం మీద తిక్క చేష్టలతో సంతోషంగా బెడ్ రూమ్ లో ఎంజాయ్ చెయ్యాల్సిన పెళ్లి కొడుకు ఇప్పుడు కటకటాలపాలైనాడు.

English summary
DJ Party: Mangaluru Rural police field FIR and detained man after his marriage of two days for organizing DJ party and not followed COVID norms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X