Drugs: తెలంగాణ వ్యక్తికి తడిసిపోయింది, అంతా సవ్యంగా ఉంటే స్టార్ హోటల్ లో ?, రూ. 100 కోట్ల డ్రగ్స్ సీజ్!
బెంగళూరు/ హైదరాబాద్: విదేశాల నుంచి దేశ రాజధానికి విమానం బయలుదేరింది. మార్గం మద్యలో ఐటీ హబ్ కు విమానం చేరుకుంది. విమానంలో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఉన్నాడు. కొన్ని గంటల్లో ఆ విమానం ఢిల్లీకి చేరుకోవలసి ఉంది. అయితే అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. కస్టమ్స్ అధికారులు ఆ వ్యక్తికి చెందిన బ్యాగ్ లు పరిశీలించారు.
బ్యాగ్ లో ఏకంగా 14 కేజీల హెరాయిన్ (డ్రగ్స్) బయటపడటంతో కస్టమ్స్ అధికారుల మైండ్ బ్లాక్ అయ్యింది. నాకు ఏమీ తెలీదు, ఉద్యోగం ఇప్పిస్తాము, ఈ బ్యాగ్ ఢిల్లీలో ఇచ్చేయ్ అని కొందరు చెప్పారని ఆ వ్యక్తి కస్టమ్స్ అధికారులకు చెప్పాడని తెలిసింది. కస్టమ్స్ అధికారుల పట్టుకున్న డ్రగ్స్ విలువ రూ. 100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంటున్నారు.

విదేశాల నుంచి వచ్చిన విమానం
ఆదిసాబాబా నుంచి ఢిల్లీకి విమానం బయలుదేరింది. మార్గం మద్యలో ఆదిసాబాబా నుంచి ఢిల్లీలో బయలుదేరిన విమానం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. విదేశాల నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానంలో తెలంగాణకు చెందిన వ్యక్తి ప్రయాణిస్తున్నాడు.

కొన్ని గంటల్లో ఊపిరిపీల్చుకోవాలని అనుకున్నాడు
బెంగళూరుకు చేరుకున్న విమానంలో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఉన్నాడని, అతని దగ్గర భారీ మొత్తంలో డ్రగ్స్ ఉన్నాయని అప్పటికే డీఆర్ఐ కస్టమ్స్ అధికారులకు సమాచారం అందిందని తెలిసింది. కొన్ని గంటల్లో ఆ విమానం బెంగళూరు నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకోవలసి ఉంది. అంతా సవ్యంగా జరిగిఉంటే హైదరాబాద్ వ్యక్తి ఊపిరిపీల్చుకోవడానికి సిద్దం అయ్యాడు.

బ్యాగ్ లో 14 కేజీల డ్రగ్స్ సీజ్
కస్టమ్స్ అధికారులు హైదరాబాద్ కు చెందిన వ్యక్తి బ్యాగ్ లు పరిశీలించారు. బ్యాగ్ లో ఏకంగా 14 కేజీల డ్రగ్స్ బయటపడటంతో కస్టమ్స్ అధికారుల మైండ్ బ్లాక్ అయ్యింది. నాకు ఏమీ తెలీదు, ఉద్యోగం ఇప్పిస్తాము, ఈ బ్యాగ్ ఢిల్లీలో ఇచ్చేయ్ అని కొందరు చెప్పారని హైదరాబాద్ వ్యక్తి కస్టమ్స్ అధికారులకు చెప్పాడని తెలిసింది.

రూ. 100 కోట్ల డ్రగ్స్ సీజ్
కెంపేగఃడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ. 100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంటున్నారు. ఢిల్లీలో తెలంగాణ వ్యక్తి బస చెయ్యడానికి స్టార్ హోటల్ కూడా బుక్ చేశారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఇదే సంవత్సరంలో బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో 8 సార్లు డ్రగ్స్ సీజ్ చేసిన అధికారులు సుమారు రూ. 250 కోట్ల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications