Bengaluru: బంగారు నగల వ్యాపారులకు అలర్ట్, కొంచెం ఏమారితే గోవిందా గోవిందా, లైఫ్ లో?
బెంగళూరు: ఐటీ హబ్ లో ఈ వ్యాపారం జరుగుతోంది, ఈ వ్యాపారం జరగదు అని తేడాలు ఏమాత్రం లేదు. బెంగళూరు నగరంలో ప్రతిరోజు కోట్ల రూపాయల లావాదేవీలతో బంగారం వ్యాపారం జరగుతుంటుంది. బంగారు నగలతో పాటు బంగారు బిస్కెట్లు అధికారికంగా భారీ మొత్తంలో అమ్ముడు పోతుంటాయి.
బెంగళూరు నగరంలోని గాంధీనగర్‌లోని ఆనందరావు సర్కిల్‌లోని గ్రీన్‌లైన్ ట్రావెల్స్ కార్యాలయం సమీపంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో మేము పోలీసులు అని కొందరు వ్యక్తులు బంగారు నగల వ్యాపారులను బెదిరించారు. ఆ సమయంలో రాయిచూర్‌కు చెందిన అబ్దుల్ రజాక్, మల్లయ్యను బెదిరించి వారి నుంచి ఒక్కొక్కరికి కేజీ. తులాల బంగారు బిస్కెట్లు, 200 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించి పరారయ్యారు.

ఈ విషయమై అబ్దుల్ రజాక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుడు అబ్దుల్ రజాక్ రాయిచూర్ నేతాజీ నగర్ షరాఫ్ బజార్ కు చెందిన స్వర్ణకారుడు మహమ్మద్ ఖాదిర్ పాషా కారు డ్రైవర్. అబ్దుల్ రజాక్ రాత్రి బయలుదేరి ప్రైవేట్ బస్సులో మార్చి 11 తెల్లవారుజామున బెంగళూరు చేరుకున్నాడు. అనంతరం అక్కిపేటలోని బాపూభాయ్ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా రాయచూర్‌లోని నగల వ్యాపారి జీ.మల్లికార్జున్ తన అసిస్టెంట్ మల్లయ్యకు రూ.60 లక్షలు ఇచ్చి బెంగళూరులోని బాపూభాయ్, అజయ్-విజయ్‌లకు బంగారు కడ్డీని తీసుకురావాలని చెప్పాడు. రాయచూర్‌లో నగల వ్యాపారి దినేష్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మల్లయ్య కుమారుడు సునీల్‌కు అంటే 75 లక్షలు ఇచ్చి బెంగళూరులోని మనీష్‌కు బంగారు కడ్డీని తీసుకురావాలని సూచించాడు.

దీంతో తండ్రీకొడుకులు మల్లయ్య, సునీల్ కుమార్ బెంగళూరు వచ్చి ఆదర్శ్ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. మ్యాటర్ లీక్ కావడంతో నకిలీ పోలీసులు బంగారు నగల వ్యాపారులను బెదిరించి రూ. 1. 20 కోట్లు లూటటీ చేసి పరారైనారని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం మీద బెంగళూరులో నకిలీ పోలీసు అధికారులు ఎక్కువ కావడంతో ప్రజలు హడలిపోతున్నారు.












Click it and Unblock the Notifications