మీడియా మీద చిందులు వేసిన మహిళా మంత్రి సోదరుడు, అంత పాటు పనికిరాదని!

బెంగళూరు/బెళగావి: కర్ణాటకలో తొలిసారి మంత్రి పదవి చేపట్టిన లక్ష్మీ హెబ్బాళ్కర్ సోదరుడి మాటలతో విధానసౌదలో భారీ కలకలం చోటుచేసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ కార్యాలయంలో మీడియా ప్రతినిధులపై దౌర్జన్యంగా మాట్లాడారని ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఒకటైన గృలహక్ష్మి స్కీమ్ గందరగోళంపై మాట్లాడటానికి మీడియా ప్రతినిధులు మంత్రి చాంబర్ కు వెళ్లారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ సోదరుడు, శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) చెన్నరాజ్ హత్తిహోళి కార్యాలయంలో ఉన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులకు, మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ సోదరునికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో శాసనమండలి సభ్యుడు చెన్నరాజ్ మీడియా ప్రతినిధులపై దౌర్జన్యంగా మాట్లాడారని అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు ఆరోపించారు. ఈ అంశం ఇప్పుడు పెద్ద రచ్చ చేస్తోంది.

Karnataka Minister Lakshmi Hebbalkars brother who was furious with the media

కర్ణాటక మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ కార్యాలయం లోపలికి వెళ్లిన మీడియా ప్రతినిధులతో చెన్నరాజ్ దురుసుగా మాట్లాడారు. మేము సమాధానం చెప్పకపోతే మీరుఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని ఎమ్మెల్సీ స్వరం పెంచాడని వెలుగు చూసింది. ఇలా హామీ పథకంపై సందేహాలను నివృత్తి చేసేందుకు మీడియా ప్రతినిధులు మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ కార్యాలయానికి వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు కర్ణాటకలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

ఈ ఘటన జరిగినప్పుడు కర్ణాటక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ కూడా అక్కడే ఉన్నట్టు సమాచారం. అయితే తరువాత జోక్యం చేసుకున్న మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ మీడియా ప్రతినిధులతో చర్చలు జరపకుండా ఆమె తన సోదరుడి తరపున మాట్లాడారని మీడియా ప్రతినిధులు ఆరోపించారు. ఇలా శక్తిసౌధలో జరిగిన ఘటన చర్చనీయాంశమైంది. మంత్రిని ప్రశ్నించేందుకు మీడియా ప్రతినిధులు వెళ్తే సంబంధం లేని వ్యక్తులు అడ్డుకోవడం ఏమిటని సోషల్ మీడియాలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

Karnataka Minister Lakshmi Hebbalkars brother who was furious with the media

మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్‌ కార్యాలయంలో కొందరు మీడియా ప్రతినిధులపై దురుసుగా మాట్లాడారనే ఆరోపణలపై బీజేపీ స్పందించింది. ఇది కాంగ్రెస్ సంస్కృతి అని మరోసారి రుజువైంది అంటూ కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఓటు వేసిన ప్రజలను మోసం చేయడం ద్వారా వ్యవస్థీకృత అవినీతికి ఇది ఒక ఫార్ములా అని బీజేపీ కర్ణాటక శాఖ ఆరోపించింది. మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ సోదరుడు అతని పరిధిలో మాత్రమే పని చేస్తాడా?, లేదా మంత్రి శాఖలో జోక్యం చేసుకుంటాడా అనే విషయం వేచి చూడాల్సిందే అని కర్ణాటక రాజకీయ నాయకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+