Father: తండ్రిని 30 ముక్కలుగా నరికేసిన కొడుకు, సొంత ఫామ్ హౌస్ లో బోర్ బావిలో వేసి కూల్ గా!

బెంగళూరు/ బాగల్ కోటే: దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. భర్త సొంత భూమిలో వ్యవసాయం చేయిస్తున్నాడు. కొన్ని ఎకరాల భూమిని కౌలుకు ఇచ్చాడు. చదువు మద్యలో నిలిపేసిన కొడుకు కూడా వ్యవసాయం పనులు చూసుకుంటున్నాడు. కొడుకు తోటలో పని చేయిస్తున్న సమయంలో అతని తండ్రి అదే తోటలోకి వెళ్లాడు. తరువాత తండ్రీకొడుకుల మద్య మాటల యుద్దం జరిగింది.

ఆ సందర్బంలో సహనం కోల్పోయిన కొడుకు ఇనుప రాడ్ తీసుకుని తండ్రి తల మీద దాడి చెయ్యడంతో అతను కుప్పకూలిపోయాడు. తండ్రి శవాన్ని 30 ముక్కలుగా నరికిన కొడుకు ఆ ముక్కలు అతని తోటలోని పాడుపడిన బోరుబావిలో వేసిరేసి పైన మూత మూసేశాడు.

భార్య, కొడుకు

భార్య, కొడుకు

కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లాలోని ముధోళ పట్టణం సమీపంలోని పీఎం. గ్రామంలో పరుశురామ్ (53), సరస్వతి దంపతులు నివాసం ఉంటున్నారు. పరుశురామ్, సరస్వతి దంపతులకు విఠల్ (21) అనే కొడుకు ఉన్నాడు. పరుశురామ్ ముధోళ సమీపంలోని ఆరు ఎకరాల సొంత భూమిలో వ్యవసాయం చేయిస్తున్నాడు.

కొడుకు కూడా అక్కడే

కొడుకు కూడా అక్కడే

పరుశురామ్ కొన్ని ఎకరాల భూమిని కౌలుకు ఇచ్చాడు. పరుశురామ్ కు గ్రామం సమీపంలోనే ఐదు ఏకరాల తోట కూడా ఉంది. చదువు మద్యలో నిలిపేసిన విఠల్ కూడా వ్యవసాయం పనులు చూసుకుంటున్నాడు కొడుకు విఠల్ వ్యవసాయం పనులు చూసుకుంటుంటే అతని తండ్రి పరుశురామ్ కూలిలకు పని చెయ్యమని చెప్పి బయట తిరుగుతున్నాడు.

మద్యం మత్తులో రచ్చరచ్చ

మద్యం మత్తులో రచ్చరచ్చ

వ్యవసాయం చేయిస్తూ డబ్బు బాగా సంపాధిస్తున్న పరుశురామ్ ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు మద్యం మత్తులోనే ఉంటున్నాడు. విపరీతంగా మద్యం సేవిస్తున్న పరుశురామ్ ఇంటికి వెళ్లి మద్యం మత్తులో అతని భార్య సరస్వతి, కొడుకు విఠల్ తో అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నాడు.

విసిగిపోయిన కొడుకు

విసిగిపోయిన కొడుకు

చిన్నచిన్న విషయాలకు భార్య సరస్వతిని పట్టుకుని చితకబాదుతున్న పరుశురామ్ శాడిస్టులాగా తయారైనాడు. తండ్రి పరుశురామ్ తీరుతో అతని కొడుకు విఠల్ విసిగిపోయాడు. ఐదు రోజుల క్రితం విఠల్ అతని తోటలో పని చేయిస్తున్న సమయంలో అతని తండ్రి పరుశురామ్ మద్యం సేవించి అదే తోటలోకి వెళ్లాడు.

ఇనుపరాడ్ తో దాడి చేసిన కొడుకు

ఇనుపరాడ్ తో దాడి చేసిన కొడుకు

తరువాత మద్యం మత్తులో ఉన్న పరుశురామ్ అతని కొడుకు విఠల్ ను ఇష్టం వచ్చినట్లు దూషించాడని తెలిసింది. ఆ సందర్బంలో ఇద్దరి మద్య మాటల యుద్దం జరిగింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన విఠల్ ఇనుప రాడ్ తీసుకుని తండ్రి తల మీద దాడి చెయ్యడంతో అతను కుప్పకూలిపోయాడు.

తండ్రి శవాన్ని 30 ముక్కలుగా నరికేశాడు

తండ్రి శవాన్ని 30 ముక్కలుగా నరికేశాడు

ఫ్రెండ్ కు ఫోన్ చేసిన విఠల్ అతని తండ్రి పరుశురామ్ ను బైక్ లో ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించాడు. అయితే అప్పటికే పరుశురామ్ ప్రాణం పోయింది. తండ్రి శవాన్ని అదే తోటలోని పాడుపడిన బోరుబావిలో వెయ్యడానికి ప్రయత్నించాడు. శరీరం బోరుబావిలో పట్టలేదు. తరువాత కొడవలి తీసుకున్న విఠల్ అతని తండ్రి పరుశురామ్ శవాన్ని 30 ముక్కలుగా నరికేశాడు.

సైలెంట్ గా ఉండిపోయిన కొడుకు...... కేసు పెట్టిన భార్య

సైలెంట్ గా ఉండిపోయిన కొడుకు...... కేసు పెట్టిన భార్య

పరుశురామ్ శవాన్ని నరికేసిన తరువాత ఫ్రెండ్ సహాయంతో విఠల్ ఒక్కొముక్క అతని తోటలోని పాడుపడిన బోరుబావిలో వేసి పైన మూత మూసేసి ఇంటికి వెళ్లాడు. మీ తండ్రి ఎక్కడ అని సరస్వతి కొడుకు విఠల్ ను అడిగింది. ఎక్కడికి వెళ్లాడో నాకు తెలీదు అని విఠల్ సైలెంట్ గా ఉండిపోయాడు. నాలుగు రోజులు అయినా భర్త ఇంటికి రాకపోవడంతో మంగళవారం సరస్వతి తన భర్త పరుశురామ్ కనపడటం లేదని ముధోళ పోలీసులకు సమాచారం ఇచ్చింది.

కూల్ గా అసలు మ్యాటర్ చెప్పిన కొడుకు

కూల్ గా అసలు మ్యాటర్ చెప్పిన కొడుకు

పోలీసులు అనుమానంతో విఠల్ ను విచారణ చేశారు. తన తండ్రి పరుశురామ్ ను 30 ముక్కలుగా నరికేసి బోరుబావిలో వేశానని విఠల్ చెప్పడంతో అందరూ హడలిపోయారు. బోరుబావిలో ఉన్న పరుశురామ్ శరీరంలోని ముక్కలు బయటకు తియ్యడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పరుశురామ్ ఫ్రెండ్ ఎస్కేప్ కావడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+