Wife: అర్దరాత్రి ఇంట్లో భార్యను చంపిన భర్త, కూతురు ఎస్కేప్, ఆత్మహత్య చేసుకోవాలని మనసు మార్చుకుని!

బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కూతురు ఉంది. దంపతులు ఇద్దరూ టైలర్ పని చేస్తున్నారు. భార్య లేడీస్ టైలర్. కొంతకాలంగా దంపతుల మద్య ఓ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. విషయం తెలుసుకున్న బంధువులు దంపతులకు నచ్చ చెబుతూ వస్తున్నారు. అయినా దంపతుల మద్య గొడవలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో కూతురు తండ్రికి నచ్చచెప్పింది. తరువాత అందరూ నిద్రపోయారు. వేకువ జామున నిద్రలేచిన భర్త కత్తి తీసుకుని అతని భార్య గొంతులో పొడిచేశాడు. మహిళ కేకలు వెయ్యడంతో కూతురు నిద్రలేచింది.

కూతురి మీద కత్తితో దాడి చేశాడు. ఇద్దరు చనిపోయారని అనుకున్న అతను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఆ సమయంలో కూతురు పైకి లేవడంతో ఆమె మీద మళ్లి కత్తితో దాడి చేశాడు. కూతురు తప్పించుకుని పారిపోయింది. కూతురు తప్పించుకోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న వ్యక్తి మనసు మార్చుకుని పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి మ్యాటర్ మొత్తం చెప్పి పోలీసులకు లొంగిపోయాడు.

బెంగళూరులో కాపురం

బెంగళూరులో కాపురం

బెంగళూరు సిటీలోని యశవంతపురం సమీపంలోని మత్తికెరెలో దానేంద్ర (49), అనసూయా (42) దంపతులు నివాసం ఉంటున్నారు. 17 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న దానేంద్ర, అనసూయా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. అనసూయా, దానేంద్ర దంపతులకు సహనా (14) అనే కూతురు ఉంది. సహనా 9వ తరగతి చదువుతోంది.

రూ. 2. 50 లక్షల అప్పు

రూ. 2. 50 లక్షల అప్పు

అనసూయా, దానేంద్ర దంపతులు ఇద్దరూ టైలర్ పని చేస్తున్నారు. అనసూయా లేడీస్ టైలర్ గా పని చేస్తూ భర్త దానేంద్రకు ఆర్థికంగా సహాయం చేస్తోంది. కుటుంబ నిర్వహణ కోసం గత ఏడాది దానేంద్ర రూ. 2.50 లక్షలు అప్పు చేశాడు. అప్పు చేసి సంవత్సరం దాటిపోయింది, అప్పు తీర్చేయాలని అనసూయా ఆమె భర్త దానేంద్రకు కొంతకాలంగా చెబుతూ ఉంది.

రాత్రి ఇంట్లో గొడవ

రాత్రి ఇంట్లో గొడవ

అనసూయా, దానేంద్ర దంపతుల మద్య అప్పు తీర్చే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న బంధువులు అనసూయా, దానేంద్ర దంపతులకు నచ్చ చెబుతూ వస్తున్నారు. అయినా అనసూయా, దానేంద్ర దంపతుల మద్య గొడవలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. రాత్రి ఇంటికి వెళ్లిన దానేంద్ర అతని భార్య అనసూయాతో ఇదే విషయంలో గొడవ పెట్టుకున్నాడు.

భార్యను చంపేశాడు

భార్యను చంపేశాడు

ఆ సమయంలో కూతురు సహనా ఆమె తండ్రి దానేంద్రకు నచ్చచెప్పడంతో గొడవ సర్దుమనిగింది. తరువాత అందరూ నిద్రపోయారు. వేకువ జామున నిద్రలేచిన దానేంద్ర కత్తి తీసుకుని అతని భార్య అనసూయా గొంతులో మూడుసార్లు పొడిచేశాడు. అనసూయా కేకలు వెయ్యడంతో కూతురు సహనా నిద్రలేచింది. దానేంద్ర కూతురు సహనా మీద కత్తితో దాడి చెయ్యడంతో ఆమె మతితప్పి పడిపోయింది. భార్య, కూతురు ఇద్దరు చనిపోయారని అనుకున్న దానేంద్ర అతను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు.

ఆలోచించి పోలీసులకు లొంగిపోయాడు

ఆలోచించి పోలీసులకు లొంగిపోయాడు

కత్తిపోట్లకు అనసూయా ప్రాణం పోయింది. ఆ సమయంలో కూతురు సహనా పైకి లేవడంతో ఆమె మీద మళ్లి కత్తితో దాడి చేశాడు. కూతురు సహనా తప్పించుకుని పారిపోయింది. తాను ఆత్మహత్య చేసుకుంటే బతికిపోయిన నా కూతురు అనాథ అవుతుందని దానేంద్ర ఆలోచించాడు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న దానేంద్ర మనసు మార్చుకుని పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి మ్యాటర్ మొత్తం చెప్పి యశవంతపురం పోలీసులకు లొంగిపోయాడు. తీవ్రగాయాలైన సహనా ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+