ఈ రాష్ట్రానికి అమెరికా దిగ్గజ కంపెనీ.. రూ. 3 వేల కోట్లతో..
అమెరికాకు చెందిన ప్రముఖ సెమీ కండక్టర్ తయారీ సంస్థ KLA కార్పొరేషన్.. భారత్ లో తమ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తమిళనాడులోని చెన్నైలో ఈ ఆర్ అండ్ డీ సెంటర్ ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వంలో ముందస్తు చర్చలు జరిపినట్లు సమాచారం అందుతోంది. రూ. 3 వేల కోట్లతో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ను నిర్మించేందుకు KLA కార్పొరేషన్ సంస్థ ముందుకొచ్చినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
అమెరికాకు చెందిన ప్రముఖ సెమీ కండక్టర్ తయారీ సంస్థ KLA కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో రూ. 3వేల కోట్లతో భారీ స్థాయిలో సెమీ కండక్టర్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు KLA కార్పొరేషన్.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరాక ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు.
KLA సంస్థ సెమీ కండక్టర్ మానుఫ్యాక్చరింగ్ లో వినియోగించే హై టెక్ మెషీన్‌లను తయారు చేస్తుంది. ఇది సాప్ట్ వేర్ అలాగే ఏఐ డెవలప్ మెంట్ ఫెసిలిటీ దాంతోపాటు ఏఐ కంప్యూటింగ్ ల్యాబ్ ను ప్రస్తుతం చెన్నైలో నిర్వహిస్తోంది. ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్ సౌజన్యంతో ఈ పరిశ్రమలను ఇప్పటికే చెన్నైలో ఏర్పాటు చేసింది KLA సంస్థ. త్వరలోనే చెన్నైలో రూ. 3వేల కోట్లతో భారీ స్థాయిలో సెమీ కండక్టర్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఈ మేరకు సమాచారం అందుతోంది.

తమిళనాడు ప్రభుత్వానికి, KLA సంస్థకు మధ్య ఈ ఒప్పందం ఓకే అయితే దాదాపు 3 వేల మంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుతం KLA సంస్థకు చెన్నైలో 800 వరకు ఉద్యోగులు ఉన్నారు. ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఇక KLA సంస్థ ప్రస్తుతం.. సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ఈ సంస్థకు అమెరికాతోపాటు యూకే, జర్మనీ, సింగపూర్, ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్లు ఉన్నాయి. ఏటా ఈ సంస్థ 10.85 బిలియన్ డాలర్ల రెవెన్యూను జనరేట్ చేస్తుంది.












Click it and Unblock the Notifications