రూ.1,299కే ఫ్లైట్ టికెట్.. ఎయిర్ ఇండియా ‘పేడే సేల్’ ఆఫర్ !
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల కోసం 'పేడే సేల్’ పేరుతో ఒక పరిమితకాల ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా దేశీయ, అంతర్జాతీయ రూట్లలో టికెట్లు చాలా తక్కువ ధరలకు లభించనున్నాయి. దేశీయ ప్రయాణాల కోసం ఎక్స్‌ప్రెస్ లైట్ టికెట్లు కేవలం రూ.1,299 నుంచి ప్రారంభం కానుండగా.. ఎక్స్‌ప్రెస్ వ్యాల్యూ టికెట్లు రూ.1,349 నుంచి అందుబాటులో ఉంటాయి. టికెట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలి.
అంతర్జాతీయ ప్రయాణాల ధరలు..
అంతర్జాతీయ రూట్లలో ఎక్స్‌ప్రెస్ లైట్ ఛార్జీలు రూ.4,876 నుంచి.. ఎక్స్‌ప్రెస్ వ్యాల్యూ ఛార్జీలు రూ.5,403 నుండి లభిస్తాయి. ఈ ప్రత్యేక ఆఫర్ కింద కొనుగోలు చేసిన టికెట్లపై 2026 మార్చి 31 వరకు ప్రయాణించే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.

అంతే కాకుండా వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వారికి అదనపు సౌకర్యాలు కూడా లభించనున్నాయి. మొబైల్ యాప్‌లో ఎక్స్‌ప్రెస్ లైట్ టికెట్లు బుక్ చేసుకుంటే కన్వీనియన్స్ ఫీజు పూర్తిగా మాఫీ అవుతుంది. అదనంగా దేశీయ రూట్లలో 15 కిలోల చెక్-ఇన్ బ్యాగేజ్‌ను కేవలం రూ.1,000కు, అంతర్జాతీయ రూట్లలో 20 కిలోల చెక్-ఇన్ బ్యాగేజ్‌ను రూ.1,300కు పొందవచ్చు.
ప్రీమియం సేవల కోసం 'ఎక్స్‌ప్రెస్ బిజ్’
మరోవైపు లగ్జరీ స్థాయిలో ప్రయాణం చేయాలి అనుకునే వారికి 'ఎక్స్‌ప్రెస్ బిజ్’ క్లాస్‌లో ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. వెబ్‌సైట్ ద్వారా బుక్ చేస్తే ఎక్స్‌ప్రెస్ బిజ్ టికెట్లపై 25 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అదేవిధంగా బిజ్ అప్‌గ్రేడ్‌లపై 20 శాతం వరకు రాయితీ వర్తిస్తుంది. ఈ బిజ్ క్లాస్‌లో విశాలమైన సీట్లు, ఉచిత భోజనం, అధిక బ్యాగేజ్ అలవెన్స్ (దేశీయంగా 25 కిలోలు, అంతర్జాతీయంగా 40 కిలోలు) వంటి ప్రీమియం సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ అయ్యే సభ్యులకు మరిన్ని రాయితీలు ఉంటాయి. హాట్ మీల్స్, సీట్ సెలక్షన్, ప్రైయారిటీ సర్వీసులపై 20 శాతం తగ్గింపు లభిస్తుంది. అదనంగా 10 కిలోల చెక్-ఇన్ బ్యాగేజ్, 3 కిలోల క్యాబిన్ బ్యాగేజ్ సౌకర్యం లభిస్తుంది. ప్రతి బుకింగ్‌పై 8 శాతం వరకు న్యూ కాయిన్స్ సంపాదించే అవకాశం కూడా ఉంటుంది.
ప్రత్యేక కేటగిరీలకు రాయితీలు..
సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, సాయుధ దళాల సిబ్బందికి కూడా ప్రత్యేక రాయితీలు లభిస్తాయని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించింది. మరోవైపు ప్రయాణికుల సౌకర్యార్థం ఈఎంఐ, 'బై నౌ పే లేటర్’ (BNPL) వంటి చెల్లింపు ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంచబడ్డాయి.
మొత్తం చూస్తే, ఈ 'పేడే సేల్’ ఆఫర్ ద్వారా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తక్కువ ధరల్లో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు చేసే అద్భుతమైన అవకాశం కల్పిస్తోందని అబిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ మంచి ఛాన్స్ ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications