రెండు నెలల్లో దుమ్ము దులిపింది.. రూ.లక్షకు రూ.4 లక్షలు!
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు ముందుగా మార్కెట్ పై అవగాహన పెంచుకోవాలి. నిపుణులను కలిసి తాను ఎందుకు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను?, రాబడి ఎలా ఉంటుంది? అందుకు ఏం చేయాలి? రిస్క్ ఎక్కువగా ఉంటుంది.. దాన్ని తట్టుకోవాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలనే వివరాలను తెలుసుకోవాలి. ఒక కంపెనీలో ఎక్కువ కాలం పెట్టుబడిని కొనసాగిస్తే రిటర్న్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో కంపెనీ నుంచి వచ్చే లాభాలను పెట్టుబడిదారుడు అందుకుంటారు.
బోండాడా ఇంజనీరింగ్: ఐపీఓలో షేర్లు పొందిన ఒక పెట్టుబడిదారుడికి లాభాలు ఏ విధంగా వస్తాయనేది తెలుసుకోవాలంటే బోండాడా ఇంజినీరింగ్ షేర్ల గురించి తెలుసుకోవాల్సిందే. బోండాడా ఇంజినీరింగ్ ఐపీఓ ఆగస్టు, 2023లో ప్రారంభమవగా ఒక్కో షేరు ధర రూ. 75గా నిర్ణయించారు. ఆగస్టు 30, 2023న మార్కెట్లలో లిస్టింగ్ అయింది. తొలి రోజే 90 శాతం ఎక్కువ ధరతో రూ. 142.50 వద్ద లిస్టింగ్‌కు వచ్చినప్పటికీ ఆ లాభాలు తీసుకోకుండా తన పెట్టుబడిని అలాగే కొనసాగిస్తే మరింత లాభాలను అందుకోవడం ఖాయం.

రూ.4.20 లక్షలైన రూ.1.20 లక్షలు: బోండాడా ఇంజినీరింగ్ స్టాక్ రూ.75 నుంచి రూ. 268.30కి చేరింది. రెండు నెలల సమయంలోనే 250 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఐపీవోలో రూ.75గా నిర్ణయించారు. ఒక్కో లాట్ లో 1600షేర్లు ఉంటాయి. ఒక లాట్ కొనాలంటే రూ.1600 X రూ.75 చొప్పున పెట్టుబడి పెట్టాలి. రూ.1.20 లక్షలవుతుంది.
పెట్టుబడిదారుడు తన పెట్టుబడిని అలాగే కొనసాగించినట్లయితే అతను పెట్టిన రూ.1.20 లక్షలు ఇప్పుడు రూ.4.20 లక్షలు అవుతుంది. ఈ స్టాక్ మున్ముందు మరింత పెరిగే సూచనలు కనపడుతున్నాయి. పెట్టుబడిని కొనసాగించడంద్వారా మరిన్ని లాభాలను అందుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications