వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2018లో బడ్జెట్: నోట్ల రద్దు ప్లస్ జీఎస్టీ ఎఫెక్ట్ సరే.. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడేదెలా?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గతంలో ఎన్నడూ లేని విధంగా 2017 - 18 ఆర్థిక సంవత్సరంలో జాతీయ ఆర్థికాభివృద్ది 6.5 శాతానికి పడిపోయిందన్న సంకేతాలు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని కలవర పెడుతోంది. మోదీ ప్రభుత్వ హయాంలో చివరి బడ్జెట్‌పై భారీ అంచనాల మధ్య దలాల్ స్ట్రీట్ సూచీలు పైపైకి దూసుకు వెళ్తున్నా నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా తగ్గుముఖం ప్రగతి సూచి తిరోగమన బాటలో ప్రయాణిస్తోంది.
ఈ పరిణామం వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ది నినాదంతో మరోమారు ప్రజల ముందుకెళ్లడానికి ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ద్వయం తీసుకునే చర్యలేమిటని పారిశ్రామిక రంగం ఎదురు చూస్తోంది. వచ్చేనెల ఒకటో తేదీన విత్త మంత్రి జైట్లీ తీసుకునే చర్యలేమిటో తెలుసుకునేందుకు వేచి చూడాల్సిందే మరి.

 జైట్లీ వచ్చే ఏడాది 10.6 శాతం ప్రగతి సాధిస్తారా?

జైట్లీ వచ్చే ఏడాది 10.6 శాతం ప్రగతి సాధిస్తారా?

నాలుగేళ్ల క్రితం 2014లో మోదీ కొలువు దీరేనాటికి భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశంగా పేరొందింది. అందుకు ప్రపంచ వ్యాప్తంగా నాడు నెలకొన్న సానుకూల పరిస్థితులు కూడా కారణమే. గత
యూపీఏ హయాంలో పదేళ్ల పాలనలో సగటు అభివృద్ది రేటు 7.8 శాతంగా నమోదైంది. కానీ బీజేపీ నేత నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అభివృద్ది రేటు మూడేళ్లుగా సగటున 7.3 శాతంగా నమోదు చేసింది. 2017 - 18లో అభివృద్ది రేటు 6.7 శాతంగా నమోదు చేసినా, మోదీ ప్రభుత్వం నాలుగుేళ్లలో సాధించిన అభివృద్ది సగటున 7.1 శాతంగా మాత్రమే నిలుస్తుంది. యూపీఏ పదేళ్ల పాలనలోని సగటు అభివృద్ది రేటును ఎన్డీయే ప్రభుత్వం అందుకోవాలంటే ఐదో సంవత్సరం (2018 - 19)లో 10.6 శాతం అభివృద్ది సాధించడం అవసరం. అలా జరిగితే సంతోషమే కానీ అది అసాధ్యమన్న భావన విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

 ఏళ్ల తర్వాత ‘మూడీస్' రేటింగ్స్ ఇలా బూస్ట్

ఏళ్ల తర్వాత ‘మూడీస్' రేటింగ్స్ ఇలా బూస్ట్

తర్వాత ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రతికూలంగా మారింది. 2016 నవంబర్ నోట్ల రద్దుతో నగదు కొరత తలెత్తింది. 2016 - 17 మార్చితో ముగిసిన త్రైమాసికానికి ఆర్థిక అభివృద్ది 6.1 శాతానికి, జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి మరింత దిగజారి 5.7 శాతానికి పడి పోయింది. తిరిగి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆర్థిక అభివృద్ది 6.3 శాతానికి పెరిగినా, నోట్ల రద్దు ప్రభావంతో క్షేత్రస్థాయిలో నగదు కొరత ప్రభావం సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నా.. భారతదేశ ఆర్థిక పరిస్థితి బేష్షుగ్గా ఉన్నదని ఇలాగే ఈ పురోగమనం సాగుతుందని ‘మూడీస్' వంటి అంతర్జాతీయ, జాతీయ రేటింగ్ సంస్థలు ఏళ్ల తర్వాత రేటింగ్ పెంచాయి. ఆర్థిక వ్రుద్ధి దివ్యంగా ఉంటుందని సూచించాయి. సంస్కరణల బాటలో మరిన్ని చర్యలు చేపట్టాలని పేర్కొన్నాయి.

జీఎస్టీ, నోట్ల రద్దు వల్లే ఈ దుస్థితి అంటున్న విపక్షాలు

జీఎస్టీ, నోట్ల రద్దు వల్లే ఈ దుస్థితి అంటున్న విపక్షాలు

నాలుగేళ్ల క్రితం అంత ఆశాజనకంగా ఉన్న పరిస్థితులు సార్వత్రిక ఎన్నికల వచ్చేసరికే తారుమారు అయ్యాయి. 2017 - 18లో 6.5 శాతానికి అభివృద్ది రేటు పతనమవుతున్నదని సంకేతాలు వినిపిస్తున్నాయి. దీనికి 2016 నవంబర్ ఎనిమిదోతేదీన నల్లధనం వెలికితీయడానికి ప్రకటించిన నోట్ల రద్దు, పన్ను ఎగవేతను అడ్డుకునేందుకు పన్నుల వ్యవస్థలో అమలులోకి తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వల్లే విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నరేంద్రమోదీ సర్కార్ తీసుకునే చర్యలేమిటన్న విషయమై అంతా ద్రుష్టి సారించారు. ప్రగతి రేటు పతనమై సంక్షోభంలో చిక్కుకున్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడం కేంద్రానికి పెను సవాలే.. ఎన్నికల వేళ ప్రజాకర్షక విధానాలు అమలు చేయాలి. మరోవైపు ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి మోదీ. జైట్లీ ద్వయం అనుసరించే వ్యూహం ఏమిటన్న విషయమై విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ధరల భూతం నియంత్రణ మోదీ సర్కార్‌కు సాధ్యమేనా?

ధరల భూతం నియంత్రణ మోదీ సర్కార్‌కు సాధ్యమేనా?

కారణాలేమైనా ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వ ‘మేకిన్ ఇండియా' నినాదం మార్మోగుతున్నా, పారిశ్రామిక ఉత్పత్తి మందకోడిగా సాగుతోంది. ఫారెక్స్ (విదేశీ మారక ద్రవ్యం) నిల్వలు నికరంగా పెంచే ఎగుమతుల పెంపునకు ప్రోత్సాహకాలిస్తూ ప్రైవేట్ పెట్టుబడులకు ఊతం ఇచ్చే చర్యలపై ప్రభుత్వం ద్రుష్టి సారించాల్సి ఉంది. ఈ క్రమంలో 125 కోట్ల మందికి పైగా భారతీయుల వినియోగ సామర్థ్యం పెంపునకు చర్యలు తీసుకుంటే ప్రభుత్వ ఆదాయం పెంచుకునే మార్గం ఉంది. ప్రజల్లో వేర్వేరు వస్తువులు, సేవలపై డిమాండ్‌కు కొదవలేదు. వినియోగాన్నిసాధ్యమైనంత పెంచి ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వ్యవసాయ సంక్షోభంతో గ్రామాల్లో నిరాశాజనక వాతావరణం నెలకొంది. దీనికి తోడు వివిధ వస్తువులపై అధిక ధరలతో భయపెడుతున్న ధరల భూతం, అటుపై గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులుగా యువత ఉండటంతో వస్తువుల వినియోగం పెంపునకు ఆటంకంగా మారింది. స్థూలంగా ద్రవ్యోల్బణ సూచీలు తగ్గినట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు ధరల భూతం ప్రజలు భయ పెడుతున్నాయి.

 ధరల తగ్గింపునకు తీసుకున్న చర్యలేమిటి?

ధరల తగ్గింపునకు తీసుకున్న చర్యలేమిటి?

2014 నుంచి మూడేళ్లుగా అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గినా ఎక్సైజ్ సుంకం భారం మోపి మరీ కేంద్రం ఆదాయం పెంచుకున్నది. తాజాగా ముడి చమురు ధర అంతకంతకు పెరుగుతుండటం పరిస్థితి మరింత విషమించడానికి దారి తీస్తుందన్న ఆందోళన ఉంది. దీనికి తోడు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ప్రజల్లో వినియోగదారుల వస్తువుల వినియోగం పెంపునకు చర్యలు తీసుకోవాల్సి ఉన్నది.

 వడ్డీరేట్లు పెరిగితే పారిశ్రామిక వర్గాలకు ప్రతికూల పరిస్థితులు

వడ్డీరేట్లు పెరిగితే పారిశ్రామిక వర్గాలకు ప్రతికూల పరిస్థితులు

ఈ క్రమంలో రోజురోజుకు పెరిగిపోతున్న ధరల భూతం ‘ద్రవ్యోల్బణా'న్ని కట్టడి చేయడం చాలా కీలకంగా మారింది. కానీ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలి. తద్వారా సామాన్యుడి హ్రుదయాన్ని గెలుచుకునేందుకు వెసులుబాటు ఉంది. ఆర్థిక వ్యవస్థ పరిపుష్టానికి వడ్డీరేట్లు ఎంతో కీలకం. వడ్డీరేట్లు, పెట్టుబడులకు మధ్య అవినాభావ సంబంధం నెలకొంది. ఇప్పటికైనా ధరల సూచీ కట్టడి చేస్తూ వడ్డీరేట్లను నియంత్రిస్తున్న ఆర్బీఐ అదే వ్యూహాన్ని అమలు చేయాలంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరగక కుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న అభిప్రాయం నెలకొంది. లేకపోతే ద్రవ్యోల్బణం పెరిగితే ఆర్బీఐ వడ్డీరేట్లు పెరుగుతాయి. వ్యాపార, వాణిజ్య వర్గాల నుంచి ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న అభిప్రాయం ఉంది.

 ఆగమేఘాలపై తెచ్చిన జీఎస్టీతో తంటాలు ఇది

ఆగమేఘాలపై తెచ్చిన జీఎస్టీతో తంటాలు ఇది

పన్ను ఎగవేతకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఊతమిస్తుందన్న అంచనాల మధ్య ఆగమేఘాలపై జీఎస్టీని కేంద్రం అమలులోకి తెచ్చింది. కానీ అందుకు భిన్నంగా నెలనెలకు ఆదాయం తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నది. ఒకవైపు ద్రవ్యలోటును నియంత్రిస్తూనే నిధుల సమీకరణ ప్రభుత్వానికి సవాల్ వంటిదే. ఈ సమస్యను అధిగమించేందుకు జీఎస్టీలో లోపాలు సవరిస్తూ చర్యలు బడ్జెట్‌లో ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉన్నది. 2014 నుంచి గతేడాది వరకు ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా తగ్గినా గతేడాది కాలంలో 30 శాతం పెరిన ప్రభావం ప్రభుత్వ ఆదాయం పెంపుపై పడింది. కానీ
పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం ద్రుష్టి సారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.72 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. లక్ష కోట్లకు పెంచుకోవాలని యోచిస్తోంది. ఈ ఆశల ఊసులు ఏ మేరకు నెరవేరతాయో వేచి చూడాల్సిందే మరి.

English summary
NEW DELHI: Union Budget 2018-19 will be Narendra Modi government's fifth and last full-fledged budget presentation before the 2019 Lok Sabha polls. While the budget session of parliament will begin from January 29, the Union Budget will be presented on February 1 around noon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X