Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Budget 2026: మొబైల్ మెషినరీ డ్యూటీలపై ప్రభుత్వ కసరత్తు

భారత్‌లో మొబైల్ ఫోన్ తయారీ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, రాబోయే బడ్జెట్‌ 2026 ఈ రంగానికి కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొబైల్ ఫోన్ తయారీకి ఉపయోగించే యంత్రాలు, వాటి భాగాలపై ఉన్న దిగుమతి సుంకాల నిర్మాణంలో మార్పులు చేయాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం గంభీరంగా పరిశీలిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నిర్ణయం మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు మరింత బలం చేకూర్చే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల చైనా హైఎండ్ మెషినరీ, అత్యంత ఖచ్చితమైన యంత్రాలు, రేర్ ఎర్త్‌కు సంబంధించిన కీలక పరికరాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీని ప్రభావం భారత ఎలక్ట్రానిక్స్‌, ముఖ్యంగా మొబైల్ తయారీ పరిశ్రమపై నేరుగా పడింది. ఇప్పటివరకు చైనా నుంచి యంత్రాలను దిగుమతి చేసుకుంటూ పనిచేసిన భారత కంపెనీలకు సరఫరా గొలుసులో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Budget 2026 Government May Cut Duties on Mobile Manufacturing Machinery to Boost Make in India

ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గంగా భారతీయ తయారీదారులు యంత్రాలను దేశంలోనే తయారు చేసే దిశగా అడుగులు వేయడం ప్రారంభించారు. అయితే ఇక్కడ మరో సమస్య ఎదురైంది. మొబైల్ ఫోన్ తయారీకి ఉపయోగించే పూర్తి యంత్రాల దిగుమతిపై ప్రస్తుతం ఎలాంటి సుంకం లేదు. కానీ అదే యంత్రాలను భారత్‌లో తయారు చేయాలంటే అవసరమైన భాగాలు, సబ్‌ సిస్టమ్స్‌, విడిభాగాలపై 5 శాతం నుంచి 25 శాతం వరకు దిగుమతి సుంకం విధించబడుతోంది.

తయారీ ఖరీదైన వ్యవహారంగా..

దీంతో లోకల్‌గా యంత్రాల తయారీ ఖరీదైన వ్యవహారంగా మారిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు యంత్రాన్ని నేరుగా దిగుమతి చేసుకుంటే తక్కువ ఖర్చుతో లభిస్తోంది. మరోవైపు దేశంలో తయారు చేయాలంటే సుంకాల భారంతో వ్యయం పెరుగుతోంది. ఈ నిర్మాణాత్మక లోపం వల్ల దేశీయ తయారీదారులు అంతర్జాతీయ పోటీలో వెనుకబడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మొబైల్ ఫోన్ అసెంబ్లీ కేంద్రంగానే..

ఈ లోపాన్ని సరిదిద్దకపోతే భారత్‌ కేవలం మొబైల్ ఫోన్ అసెంబ్లీ కేంద్రంగానే మిగిలిపోయే అవకాశముందని పరిశ్రమ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి తయారీ దేశంగా ఎదగాలంటే యంత్రాల తయారీ, కీలక టెక్నాలజీల్లో స్వయం సమృద్ధి అవసరమని వారు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా సుంకాల విధానంలో మార్పులు తప్పనిసరి అని అభిప్రాయపడుతున్నారు.

ఈ బడ్జెట్‌లో..

ఈ నేపథ్యంలో బడ్జెట్‌ 2026పై మొబైల్ తయారీ రంగం భారీ ఆశలు పెట్టుకుంది. యంత్రాల భాగాలపై దిగుమతి సుంకాల తగ్గింపు, లోకల్ మెషిన్ మాన్యుఫాక్చరింగ్‌కు ప్రోత్సాహకాలు, చైనా ఆధారాన్ని తగ్గించే విధాన నిర్ణయాలు ఈ బడ్జెట్‌లో చోటు చేసుకుంటాయా అనే అంశంపై అందరి దృష్టి ఉంది.

ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ 2026లో తీసుకునే నిర్ణయాలే... భారత్‌ మొబైల్ తయారీ రంగం భవిష్యత్తును కొత్త దిశగా నడిపిస్తాయా? లేక ఇప్పటివరకు కొనసాగుతున్న అసెంబ్లీ ఆధారిత మోడల్‌కే పరిమితం చేస్తాయా? అన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+