Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్టాక్ మార్కెట్‌లో అతిపెద్ద తప్పు ఇదే: ఎలన్ మస్క్ పెట్టుబడి సూత్రం ఏంటి?

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఎలన్ మస్క్ పెట్టుబడిదారులకు కీలక సలహాలు ఇచ్చారు. ఇటీవల నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్ 'పీపుల్ బై WTF'లో పాల్గొన్న సందర్భంగా.. ఎలన్ మస్క్‌ను రెండు కీలకమైన ప్రశ్నలు అడిగారు. పెట్టుబడిదారులకు మీరేం సలహా ఇస్తారు? ఒక సాధారణ పెట్టుబడిదారుగా మీరు ఏ రంగంలో డబ్బు పెడతారు?.. అని అడిగిన ఈ రెండు ప్రశ్నలకు చాలా సరళమైన, కానీ లోతైన సమాధానాలు ఇచ్చారు.

స్టాక్ మార్కెట్‌లో అతిపెద్ద పొరపాటు ఏమిటి?
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారులు చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటనే ప్రశ్నకు మస్క్ ఇలా బదులిచ్చారు. "ప్రజలు చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే, వారు మార్కెట్‌లో రోజువారీగా వచ్చే 'శబ్దానికి' భయపడి ఆందోళన చెందుతారు. షేర్ ధర ఈ రోజు పెరిగిందా, రేపు తగ్గిందా అని చూస్తారు. కానీ వాస్తవానికి పెట్టుబడి అనేది ఎల్లప్పుడూ సుదీర్ఘ ప్రయాణం, ఇది దీర్ఘకాలిక ఆట." అని మస్క్ చెప్పారు.

Elon Musk Biggest Stock Market Lesson The No 1 Mistake Investors Make and His Simple Investment Rule

మస్క్ పెట్టుబడి పెట్టడానికి అనుసరించే సూత్రం చాలా సూటిగా ఉంటుందని ఆయన ఇలా అన్నారు. "మీకు ఆ కంపెనీ ఉత్పత్తులు నిజంగా నచ్చితేనే, దాని స్టాక్‌లో డబ్బు పెట్టండి." ఆ కంపెనీ తయారుచేసే వస్తువులను మీరు స్వయంగా ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారా? రాబోయే కాలంలో కూడా ఆ కంపెనీ ప్రజల జీవితాలను మెరుగుపరిచే సేవలు లేదా వస్తువులను అందిస్తుందని మీరు భావిస్తున్నారా అని ఆలోచించాలన్నారు. కంపెనీ అనేది కాగితాలు లేదా భవనాలతో ఏర్పడదు, అది మనుషుల సమూహంతో ఏర్పడుతుంది. "ఆ కంపెనీలోని వ్యక్తులు కష్టపడతారా? వారిలో ప్రతిభ ఉందా? వారు దీర్ఘకాలం పాటు నిలబడగలిగే శక్తి, సామర్థ్యం వారిలో ఉందా?" అని చూడాలన్నారు. షేర్ ధరలో రోజువారీ హెచ్చుతగ్గులు తరచుగా ప్రజల భావోద్వేగాలు, చిన్న వార్తల వల్ల వస్తాయి. దీనికి కంపెనీ నిజమైన నాణ్యతతో సంబంధం ఉండదు. బలమైన పునాది (బెస్ట్ ప్రొడక్ట్స్, మంచి టీమ్) ఉన్న కంపెనీలే దీర్ఘకాలంలో విజయం సాధిస్తాయని ఎలన్ మస్క్ పేర్కొన్నారు.

ఎలన్ మస్క్ ఏ రంగంలో పెట్టుబడి పెడతారు?
"మీరు ఒక సాధారణ పెట్టుబడిదారు అయితే, ఈ రోజు ఏ రంగంలో డబ్బు పెడతారు?" అనే ప్రశ్నకు మస్క్ ఇచ్చిన సమాధానం భవిష్యత్తు అవకాశాలపై ఆధారపడి ఉంది. మస్క్ సాంప్రదాయ పెట్టుబడిదారుని కాదని, ఆయన కంపెనీలను సృష్టిస్తారని చెప్పారు. అందుకే ఆయన దృష్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావం చూపగల రంగాలపై ఉంది. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపుతుందని మస్క్ అన్నారు. ఉదాహరణకు గూగుల్ వంటి కంపెనీలు భారీ డేటా కారణంగా ముందంజలో ఉన్నాయి. ఏఐ, రోబోటిక్స్ రెండూ కలిసి వస్తువులు, సేవలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని 10 రెట్లు లేదా 100 రెట్లు పెంచగలవు.ఏఐ విప్లవానికి కీలకమైన GPUలు (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు) సరఫరా చేసే Nvidia వంటి కంపెనీలు ఈ రంగంలో చాలా ముఖ్యమైనవి. అంతరిక్ష సాంకేతికతపై కూడా మస్క్ దృష్టి పెట్టారు. మస్క్ అభిప్రాయం ప్రకారం, రాబోయే కొన్ని దశాబ్దాలలో ఏఐ, రోబోటిక్స్ నుంచే అతిపెద్ద సంపద సృష్టించబడుతుంది. అందుకే, ఈ రంగాలను గుర్తించి పెట్టుబడి పెట్టాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+