EPF సంస్కరణలు.. లక్షలాది ఉద్యోగులపై ప్రభావం
రాబోయే కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఉద్యోగులకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (EPF) తప్పనిసరి సభ్యత్వానికి ఉన్న వేతన పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.15,000 నుంచి రూ.25,000కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, లక్షలాది ఉద్యోగుల చేతికి వచ్చే జీతం, అలాగే దీర్ఘకాలిక సామాజిక భద్రతపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది.
ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, వచ్చే నెలలో జరిగే EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో దీనిపై అధికారికంగా చర్చించనున్నారు. బడ్జెట్ ప్రసంగంలోనే ఈ విషయంపై స్పష్టత ఇవ్వవచ్చని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వచ్చే అవకాశమూ ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం నెలకు రూ.15,000 మించి జీతం పొందే ఉద్యోగులకే ఈపీఎఫ్ తప్పనిసరి. అయితే 2014 తర్వాత ఈ పరిమితి మారకపోవడంతో, వేతనాలు పెరిగినా అనేక మంది తక్కువ, మధ్యస్థ స్థాయి కార్మికులు సామాజిక భద్రతా పరిధికి బయటే ఉన్నారు. ఈ నేపథ్యంలో పరిమితిని రూ.25,000కి పెంచడం ద్వారా మరింత విస్తృత వర్గాన్ని ఈపీఎఫ్ కవరేజీలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది.
వేతనం ఆధారంగా EPF కట్..
ఈ మార్పు అమలైతే, నెలకు రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య జీతం పొందే ఉద్యోగుల వేతనంలో ఈపీఎఫ్ కట్ పెరుగుతుంది. వేతన శాతంపై ఆధారపడి కట్ ఉండటంతో, చేతికి వచ్చే జీతం కొంత తగ్గినా, రిటైర్మెంట్ సమయంలో లభించే పొదుపు గణనీయంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇదే సమయంలో, ఉద్యోగుల వాటాకు సరిపడా మొత్తాన్ని యజమానులు కూడా చెల్లించాల్సి ఉండటంతో సంస్థలపై వ్యయభారం పెరుగుతుంది. ముఖ్యంగా కార్మిక ఆధారిత రంగాల్లో జీతాల వ్యయం పెరిగే అవకాశం ఉంది. వేతన పరిమితి పెరిగితే EPFతో పాటు పెన్షన్ (EPS), ఉద్యోగుల బీమా (EDLI) వంటి అన్ని EPFO-లింక్డ్ ప్రయోజనాలు కూడా సవరించిన సీలింగ్‌కు అనుగుణంగా మారతాయి. అంటే ఉద్యోగుల సామాజిక భద్రత మొత్తం ప్యాకేజీనే బలోపేతం అయ్యే అవకాశం ఉంది.
ఈ ప్రతిపాదన వెనుక న్యాయపరమైన కారణం కూడా ఉంది. వేతనాలు, ద్రవ్యోల్బణం పెరిగినా ఈపీఎఫ్ పరిమితి మారకపోవడాన్ని సుప్రీంకోర్టు ఇటీవల గమనించింది. నాలుగు నెలల్లోగా వేతన సీలింగ్‌ను సవరించాలని EPFOను కోర్టు ఆదేశించినట్లు సమాచారం. దాదాపు పదేళ్లుగా రూ.15,000 పరిమితి యథాతథంగా ఉండటం ఈ నిర్ణయానికి ప్రధాన నేపథ్యం. మొత్తంగా చూస్తే, రాబోయే బడ్జెట్ ఉద్యోగులకు తక్షణ జీతంపై స్వల్ప భారం మోపినా, దీర్ఘకాలిక భద్రతను పెంచే కీలక మలుపుగా మారే అవకాశముందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications