రిపబ్లిక్ డే వేళ.. కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్: భారీగా తగ్గనున్న ఈ కార్లు రేట్లు

యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుండి దిగుమతి చేసుకునే కార్లపై భారత్ తన సుంకాలను గణనీయంగా తగ్గిస్తుందని రాయిటర్స్ తెలిపింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుత 110 శాతం టారిఫ్ ను వసూలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీన్ని సగానికి పైగా అంటే 40 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని తెలిపింది. యూరోపియన్ యూనియన్ దేశాలతో ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్) మంగళవారం నాటికి ఖరారయ్యే అవకాశం ఉంది.

యూరోపియన్ యూనియన్ లోని 27 దేశాల నుండి 16.3 లక్షల రూపాయలు దాటిన దిగుమతి ధర ఉన్న కొన్ని రకాల కార్లపై ఈ టారిఫ్ ను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ కోతలు క్రమేణా 10 శాతానికి మరింత తగ్గుతాయనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. దిగుమతి అడ్డంకులను తగ్గించాలని చాలా కాలంగా వోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ వంటి యూరోపియన్ ఆటో దిగ్గజాలు భారత్ ను కోరుతున్నాయి.

India to cut EU car Volkswagen Mercedes-Benz and BMW tariffs from 110 to 40 ahead of trade deal

దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం యూరోపియన్ యూనియన్ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకునే అవకాశం ఉందని రాయిటర్స్ పేర్కొంది. ఈ టారిఫ్ తగ్గింపు వల్ల భారత మార్కెట్‌లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడానికి ఆయా ఆటోమేకర్స్ కంపెనీలన్నీ కూడా పూర్తి వెసలుబాటు కల్పించినట్టవుతుందని, కార్ల దిగుమతి మరింత ముమ్మరమౌతుందని అంచనా వేసింది. ఆటోమొబైల్ రంగంలో పోటీ పెరగడం వల్ల కార్ల ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశాలు సైతం లేకపోలేదు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తోన్ వాణిజ్య విధానాలు, అదనపు టారిఫ్ వడ్డింపుల వల్ల సంభవిస్తోన్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటోండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. యూరోపియన్ యూనియన్ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ను కుదుర్చుకోవడం వైపు మొగ్గు చూపుతోంది. ఆటోమొబైల్ మార్కెట్‌కు సంబంధించి ఈ నిర్ణయాలు, చర్యలు ఉంటోన్నాయి.

బ్రస్సెల్స్ తో కొనసాగుతున్న సుదీర్ఘ వాణిజ్య చర్చలు ముగింపు దశకు చేరుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ భారత్ లో పర్యటిస్తోన్నారు. పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చస్తోన్నారు. ఆమె పర్యటన కొనసాగుతున్న నేపథ్యలో యూరప్ దేశాల నుంచి దిగుమతి చేసుకునే లగ్జరీ కార్ల టారిఫ్ తగ్గించాలనే నిర్ణయానికి వచ్చింది.

ప్రస్తుతం పూర్తిస్థాయి తయారైన కార్లపై ప్రపంచంలోనే అత్యధిక దిగుమతి సుంకాలు విధిస్తోంది బారత్. స్వదేశీ తయారీదారులను రక్షించడానికి, స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వోక్స్ వ్యాగన్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి కార్లపై 110 శాతం టారిఫ్ విధిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+