పొలంలో పుట్టిన స్టార్ట్ అప్… స్ట్రాబెర్రీతో యువ రైతుల కలల పంట!
వ్యవసాయం అంటే నష్టం అనే మాటను తప్పుగా నిరూపిస్తూ, ఒడిశాలో ఇద్దరు యువ రైతులు ఎర్రగా మెరిసే స్ట్రాబెర్రీలతో లక్షల్లో ఆదాయం సాధిస్తున్నారు. ఉద్యోగాల కోసం నగరాల వెంట తిరగకుండా, గ్రామంలోనే ఆధునిక సాగు వైపు అడుగులు వేసిన చరణ్ లెంక, సాధవ్ రౌలా ఈ రోజు యువ రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
బ్రహ్మపురం సమీపంలోని సజన్‌పుర్ పంచాయతీకి చెందిన ఈ ఇద్దరు మిత్రులు నాలుగేళ్ల క్రితం చిన్న ప్రయోగంగా స్ట్రాబెర్రీ సాగును మొదలుపెట్టారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి తెప్పించిన కేవలం 25 మొక్కలను ప్లాస్టిక్ సంచుల్లో నాటగా, మూడు నెలల్లోనే 18 కిలోలకుపైగా దిగుబడి రావడంతో ఆశ్చర్యపోయారు. ఈ విజయం వారిని వెనక్కి తగ్గనీయలేదు. క్రమంగా సాగు విస్తీర్ణాన్ని పెంచుతూ, ప్రస్తుతం మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ నుంచి నాణ్యమైన విత్తనాలు తెప్పించి ఒక ఎకరం భూమిలో సాగు చేస్తున్నారు.

ఆర్గానిక్ పద్ధతి… అడ్వాన్స్ ఆర్డర్లు
బిందుసేద్యం (డ్రిప్ ఇరిగేషన్) ద్వారా పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో స్ట్రాబెర్రీలు పండిస్తున్నారు. రసాయన ఎరువులు లేకుండా సహజ ఎరువులు వాడటం వల్ల పండ్లకు మంచి రుచి, నాణ్యత పెరిగింది. దీంతో దుకాణాలు, హోటళ్లు, జ్యూస్ సెంటర్ల నుంచి ముందస్తు అడ్వాన్స్ ఆర్డర్లు వస్తున్నాయని చరణ్ లెంక తెలిపారు. ఈ సాగు ద్వారా ప్రస్తుతం ఐదుగురు స్థానికులకు ఉపాధి కూడా కల్పించారు.
ప్రభుత్వ సబ్సిడీలు ఉన్నాయా?
స్ట్రాబెర్రీ వంటి హార్టికల్చర్ పంటలు సాగు చేయాలనుకునే యువ రైతులకు ప్రభుత్వం నుంచి గట్టి ప్రోత్సాహమే లభిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన పంటల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పలు సబ్సిడీ పథకాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH) పథకం ద్వారా స్ట్రాబెర్రీ వంటి అధిక విలువైన పంటలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పాటుకు 50 నుంచి 70 శాతం వరకు సబ్సిడీ, నర్సరీల అభివృద్ధి, నాణ్యమైన మొక్కల కొనుగోలుపై రాయితీలు కల్పిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో యువ రైతులను ప్రత్యేకంగా ప్రోత్సహించేందుకు అదనపు పథకాలు కూడా అమల్లో ఉన్నాయి. ఈ సబ్సిడీల కోసం రైతులు తమ స్థానిక హార్టికల్చర్ శాఖ, వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అనుకూలమైన వాతావరణం..
స్ట్రాబెర్రీ సాగుకు అనువైన వాతావరణం కొంచం చల్లగా ఉండే ప్రాంతాలు.. లేదా మధ్యస్థ ఉష్ణోగ్రతలు. సాధారణంగా 15 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు ఈ పంటకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. నేల విషయానికి వస్తే, నీరు నిల్వ ఉండని ఇసుక మిశ్రమ సారవంతమైన భూమి అవసరం. ఈ నేలల్లో సాగు చేస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు ఇస్తాయి.
మొక్కలు ఎక్కడ దొరుకుతాయి?
సాగుకు ఉపయోగించే మొక్కలు అత్యంత కీలకం. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల నుంచి తీసుకువచ్చే నాణ్యమైన రన్నర్లను ఉపయోగిస్తే దిగుబడులు మెరుగ్గా వస్తాయని రైతులు చెబుతున్నారు. సాగులో భాగంగా రైజ్డ్ బెడ్స్‌ను ఏర్పాటు చేసి, వాటిపై ప్లాస్టిక్ మల్చింగ్‌తో మొక్కలను నాటడం వల్ల తేమ నిల్వ ఉండటంతో పాటు కలుపు మొక్కలు తగ్గుతాయి.
60 రోజుల నుంచి పంట చేతికి..
నీటి యాజమాన్యంలో డ్రిప్ ఇరిగేషన్ తప్పనిసరిగా ఉండాలి. తక్కువ నీటితో ఎక్కువ ఫలితం అందించే ఈ పద్ధతి ద్వారా మొక్కలకు అవసరమైనంత నీరు, పోషకాలు అందుతాయి. సాధారణంగా నాటిన 60 నుంచి 90 రోజుల్లోనే స్ట్రాబెర్రీ పంట చేతికి వస్తుంది. సరైన నిర్వహణ ఉంటే ఎకరాకు సగటున 8 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి సాధించే అవకాశముంది.
సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న హైవాల్యూ పంటల వైపు అడుగులు వేస్తే వ్యవసాయం కూడా ఒక స్టార్ట్ అప్‌లా మారుతుందని చరణ్ లెంక, సాధవ్ రౌలా లాంటి యువ రైతుల విజయం స్పష్టం చేస్తోంది. సరైన అవగాహన, ప్రభుత్వ సహకారం, ఆధునిక సాగు పద్ధతులు కలిస్తే గ్రామాల్లోనే లాభదాయకమైన వ్యవసాయంతో యువతకు మంచి భవిష్యత్తు సాధ్యమని వారు నిరూపిస్తున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications