బంగారం ధరలకు భారీగా ఊతం- ఇకపై.. !!
దేశంలో నేడు బంగారం, వెండి ధరలు పెరిగాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ సమయంలో వీటి ధరలు ఎగబాకడం కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల, దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో నమోదైన సానుకూల ట్రెండ్ వల్ల ఒకే రోజు పసిడి ధరలు ప్రియం అయ్యాయి. ఈ పెరుగుదల నామమాత్రమే అయినా సానుకూల ట్రెండ్ ఏర్పడటానికి గట్టి పునాది వేసినట్టయింది.
దేశీయంగా 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధరలో రూ. 270 మేర పెరిగి రూ. 1,53,440 కి చేరింది. సాధారణంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 250 మేర పెరిగి రూ. 1,40,650 మార్కును తాకింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి ప్రస్తుతం రూ. 1,15,080 వద్ద ట్రేడ్ అవుతోంది.

దేశీయ కమోడిటీ మార్కెట్లో బంగారంతో పాటు వెండి ఫ్యూచర్స్ కూడా ఇదే ట్రెండ్ కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.57 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,51,667 వద్ద ట్రేడ్ అయ్యాయి. డిసెంబర్ డెలివరీ వెండి కాంట్రాక్టులు కూడా 1.31 శాతం లాభపడి కిలోకు రూ. 2,35,159 కి చేరుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 0.8 శాతం పెరిగి ఔన్సుకు 4,328.39 డాలర్లకు చేరింది. అమెరికా బాండ్ ఈల్డ్స్ 4.9 శాతం లోపు స్థిరపడటం వీటి రికవరీకి ఊతం ఇచ్చింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,53,440 వద్ద స్థిరపడింది. ఆయా నగరాల్లో 22 క్యారెట్ల పసిడి రూ. 1,40,650 వద్ద నిలిచింది. ముంబై, కోల్కతా, బెంగళూరు మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,53,440 గాను, కొనసాగుతోంది. ఢిల్లీలో ఈ ధరలు కొంత ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ. 1,53,509 పలకగా, 22 క్యారెట్ల ధర రూ. 1,40,800 వద్ద ట్రేడ్ అవుతోంది.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,344, 22 క్యారెట్లు - రూ. 14,065, 18 క్యారెట్లు - రూ. 11,834
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,344, 22 క్యారెట్లు- రూ. 14,065, 18 క్యారెట్లు - రూ. 11,508
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,344, 22 క్యారెట్లు- రూ. 14,065, 18 క్యారెట్లు - రూ. 11,508
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,344, 22 క్యారెట్లు- రూ. 14,065, 18 క్యారెట్లు - రూ. 11,508
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,344, 22 క్యారెట్లు- రూ. 14,065, 18 క్యారెట్లు - రూ. 11,508
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,344, 22 క్యారెట్లు- రూ. 14,065, 18 క్యారెట్లు - రూ. 11,508












Click it and Unblock the Notifications
