పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ- ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు.. దరఖాస్తు ఇలా..!!
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఏపీపీఎస్సీ ప్రాధమిక నోటిఫికేషన్ ఇచ్చిన మరుసటి రోజునే పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. కేటగిరీల వారీగా పోస్టుల లెక్కలను వెల్లడించింది. అభ్యర్ధులకు దరఖాస్తు వివరాలతో పాటుగా.. పరీక్షా విధానం.. ఫీజలు గురించి పూర్తి సమాచారాన్ని పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు వివరించింది.
ఏపీ ప్రభుత్వం పోలీస్ అభ్యర్థులకు శుభవార్త తెలిపింది. పోలీసు శాఖలో 2,050 పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేటగిరీల వారీగా పోస్టుల భర్తీ వివరాలను నోటిఫికేషన్ లో వెల్లడించారు. అందులో 378 ఎస్ఐ, 1,156 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించింది. ఈ ఉద్యోగాల కోసం ప్రాథమిక రాత పరీక్ష తేదీని త్వరలో APSLPRB ప్రకటించనుంది. దరఖాస్తును అధికారిక వెబ్‌సైట్ (https://slprb.ap.gov.in) ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే ఏపీపీఎస్సీ ద్వారా ప్రాధమికంగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా.. ఇప్పుడు పోలీసు ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు
పోలీసు ఉద్యోగాల్లో ప్రభుత్వం వెల్లడించిన కేటగిరీల మేరకు 09 - SI (SPF) పోస్టులు (పురుషులు), అదే విధంగా 50 - SCT SI (కమ్యూనికేషన్) పోస్టులు (పురుషులు, మహిళలు), మరో 10 - SI (PTO) పోస్టులు, 43 సైంటిఫిక్ అసిస్టెంట్ (FSL) పోస్టులు, 827 - PC (సివిల్/AR) పోస్టులు (పురుషులు, మహిళలు), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల శాఖలో - 158 ఫైర్‌మెన్ పోస్టులు ఉండగా.. జైళ్లు, సంస్కరణ సేవల శాఖలో - 171 వార్డర్ పోస్టులు (పురుషులు, మహిళలు) ప్రకటించారు. కాగా.. 200 - PC (కమ్యూనికేషన్) పోస్టులు (పురుషులు, మహిళలు)..వీటితో పాటుగా 213 - PC (మెకానిక్స్, డ్రైవర్లు) పోస్టులు (పురుషులు) భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో.. అభ్యర్ధులకు తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా పూర్తి సమాచారం అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.













Click it and Unblock the Notifications
