బంగారం ధరల్లో ఊపశమనం: ఆభరణాల కొనుగోళ్లపై

దేశంలో పసిడి ప్రియులకు కొంత ఉపశమనం లభించింది. దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నేడు దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరల్లో స్వల్ప క్షీణత కనిపించింది. అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ విలువలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పసిడి ధరల్లో కొద్ది రోజులుగా ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు ధరలు స్వల్పంగా తగ్గాయి.

అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు 220 రూపాయలు తగ్గింది. 1,44,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 200 రూపాయలు క్షీణించి 1,32,000 రూపాయలకు చేరుకుంది. ఇక సామాన్యులకు అందుబాటులో ఉండే 18 క్యారెట్ల బంగారం ధరలో కూడా ఈ తగ్గుదల రికార్డయింది. 10 గ్రాములకు 160 రూపాయల మేర తగ్గి 1,08,000 రూపాయల వద్ద స్థిరపడింది.

Gold price inches Low in India at MCX with 24K 22K and 18K Stands at these Rates Various Cities

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,32,320 రూపాయలుగా నమోదు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 1,44,560 రూపాయల వద్ద స్థిరంగా సాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా దాదాపుగా ఇవే ధరలు అందుబాటులో ఉంటోన్నాయి. ముంబై, బెంగళూరు, కోల్‌కతా, తిరువనంతపురంలల్లో దాదాపుగా ఇవే రేట్లు నమోదయ్యాయి. కొనుగోలుదారులు ఈ బేసిక్ రేట్లపై అదనంగా జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

బుమ్రా వ్యవహారంలో మొత్తానికి ఓపెన్ అయ్యాడు- అజిత్ అగార్కర్ అన్ హ్యాపీ
బుమ్రా వ్యవహారంలో మొత్తానికి ఓపెన్ అయ్యాడు- అజిత్ అగార్కర్ అన్ హ్యాపీ

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,44,950 రూపాయలుగా ఉండగా, 22 క్యారెట్ల ధర 1,33,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,44,150 రూపాయలు పలుకుతోంది. సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా బంగారంపై మదుపరులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు పసిడిలో పెట్టుబడులు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

నాగ పంచమి ఎప్పుడు, ఏ రోజున జరుపుకోవాలి
నాగ పంచమి ఎప్పుడు, ఏ రోజున జరుపుకోవాలి

వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,400, 22 క్యారెట్లు - రూ. 13,200, 18 క్యారెట్లు - రూ. 11,015

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,400, 22 క్యారెట్లు- రూ. 13,200, 18 క్యారెట్లు - రూ. 10,800

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,400, 22 క్యారెట్లు- రూ. 13,200, 18 క్యారెట్లు - రూ. 10,800

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,400, 22 క్యారెట్లు- రూ. 13,200, 18 క్యారెట్లు - రూ. 10,800

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,400, 22 క్యారెట్లు- రూ. 13,200, 18 క్యారెట్లు - రూ. 10,800

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,400, 22 క్యారెట్లు- రూ. 13,200, 18 క్యారెట్లు - రూ. 10,800

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+