Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏటీఎం యూజర్లకు RBI గుడ్ న్యూస్.. !!

నగదు లావాదేవీల్లో చిల్లర నోట్ల కొరత సమస్య దీర్ఘకాలంగా ప్రజలను వేధిస్తోంది. నోట్ల రద్దు జరిగి దశాబ్దం కావస్తున్నా ఈ పరిస్థితి మారట్లేదు. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకున్న తర్వాత ఇక చిన్న నోట్లు, కాయిన్ల కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవసరం లేకపోయినా, చిల్లర కోసం ఏదో ఒకదాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని జనం ఎదుర్కొంటోన్నారు. ఇటువంటి పరిస్థితికి చెక్ పడబోతోంది త్వరలో. డిజిటల్ పేమెంట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. రోజువారీ క్రయ విక్రయాల్లో చిల్లర కొరత తప్పట్లేదు.

దీన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా రూ. 10, రూ. 20, రూ. 50 విలువ గల నోట్లను డిమాండ్‌ను బట్టి అందించడానికి కరెన్సీ డిస్పెన్సింగ్ మెషీన్లు, నాణేలను అందించడానికి 'హైబ్రిడ్ ఏటీఎంలు' ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే ముంబైలో పైలెట్ ప్రాజెక్ట్ దీన్ని చేపట్టింది. చిన్న విలువ నోట్లను ఎక్కువగా ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్‌ను కేంద్రం ఇదివరకే ఆదేశించింది.

Hybrid ATMs plans by RBI to Dispense Rs 10 20 and 50 Notes to Ease Shortage and Cash Crunch Relief

దేశవ్యాప్తంగా రూ. 10 నుంచి 50 రూపాయల వరకు చిన్న డినామినేషన్ నోట్లను అందించే హైబ్రిడ్ ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోన్నట్లు అటు రిజర్వ్ బ్యాంక్ కూడా సూచనప్రాయంగా వెల్లడించింది. ఈ హైబ్రిడ్ ఏటీఎంలను మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి అధిక నగదు లావాదేవీలు జరిగే ప్రదేశాలలో ఏర్పాటు చేస్తారు. ఇది చిన్న మొత్తాల నగదు లభ్యతను మెరుగుపరుస్తుందని ది మింట్ తెలిపింది.

దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నప్పటికీ, గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో లక్షలాది మంది రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారులు నగదుపైనే ఆధారపడుతున్నారు. వారికి 10, 20, 50 రూపాయల చిల్లర దొరకకపోవడం జీవనోపాధికి పెద్ద అడ్డంకిగా మారుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం హైబ్రిడ్ ఏటీఎంలను ప్లాన్ చేసింది. ముంబైలో పైలట్ ప్రాజెక్టు ద్వారా హైబ్రిడ్ ఏటీఎంల పనితీరును పరీక్షిస్తోన్నారు రిజర్వ్ బ్యాంక్ అధికారులు. ఇది సక్సెస్ కావడంతో రిజర్వ్ బ్యాంక్ చిన్న నోట్ల ముద్రణను పెంచాలని యోచిస్తోంది. తద్వారా ఏటీఎంలల్లో నగదు కొరత ఉండదు.

ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం- చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 500 నోట్లు పరిమాణం (వాల్యూమ్) పరంగా 41.2 శాతం ఉంటోంది. విలువ (వాల్యూ) పరంగా కూడా దీనిదే ఆధిపత్యం. 86 శాతం 500 రూపాయల నోట్లు మార్కెట్ లో చలామణిలో ఉంటోన్నాయి. చిన్న నోట్ల పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. మార్కెట్ లో అందుబాటులో ఉంటోన్న చిన్న విలువ నోట్లు.. అంటే రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20, రూ. 50 మొత్తం కలిపి మొత్తం కరెన్సీ పరిమాణంలో సుమారు 38 శాతం. వాటి మారకం విలువ 3.1 శాతం మాత్రమే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+