అమ్మో.. ఎంత మంచి కంపెనీ ! సిగరెట్ తాగని ఉద్యోగులకు 6 రోజులు ఎక్స్‌ట్రా లీవ్స్ !!

ఉద్యోగుల ఆరోగ్యం, పనితీరు మెరుగుపడేలా జపాన్‌కు చెందిన ఓ సంస్థ తీసుకున్న వినూత్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టోక్యో కేంద్రంగా పనిచేస్తున్న Piala Inc. సంస్థ, సిగరెట్లు తాగని ఉద్యోగులకు ఏడాదికి అదనంగా 6 రోజుల ప్రత్యేక సెలవులు ప్రకటించింది. ఉద్యోగుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే కాకుండా, కార్యాలయ సమయాన్ని సమర్థవంతంగా వినియోగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

ధూమపాన విరామాల వల్ల సమయ నష్టం

పియాలా సంస్థ కార్యాలయం టోక్యోలోని ఒక ఎత్తైన భవనంలోని 29వ అంతస్తులో ఉంది. సిగరెట్ తాగాలంటే ఉద్యోగులు భవనం వెలుపల ఉన్న ప్రత్యేక ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఒక్కోసారి స్మోకింగ్ బ్రేక్ కోసం వెళ్లి రావడానికి సుమారు 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోంది. రోజుకు మూడు లేదా నాలుగు సార్లు స్మోకింగ్ బ్రేక్ తీసుకునే ఉద్యోగులు దాదాపు గంట సమయాన్ని కోల్పోతున్నారని కంపెనీ గుర్తించింది. ఇదే సమయంలో ధూమపానం చేయని ఉద్యోగులు నిరంతరంగా పని చేస్తుండటంతో వారిలో అసంతృప్తి పెరిగింది. ఈ విషయాన్ని కొందరు ఉద్యోగులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.

japanese-company-good-news-to-non-smokers-that-giving-extra-leaves-of-6-days-to-boost-productivity-i

శిక్ష కాదు.. ప్రోత్సాహమే మార్గం

ఈ ఫిర్యాదులపై స్పందించిన సంస్థ సీఈవో Takao Asuka వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సిగరెట్ తాగే వారిని శిక్షించడం కంటే, తాగని వారిని ప్రోత్సహించడం ఉత్తమ మార్గమని భావించారు. అందుకే ధూమపానం చేయని ఉద్యోగులకు ఏడాదికి అదనంగా 6 రోజుల చెల్లింపు సెలవులను ప్రకటించారు. ఈ సెలవులను ఉద్యోగులు తమకు అనుకూలమైన సమయంలో వినియోగించుకునే అవకాశం కల్పించారు. దీంతో ఉద్యోగుల్లో సానుకూల స్పందన వ్యక్తమైంది.

కంపెనీ అమలు చేసిన ఈ విధానం అనూహ్య ఫలితాలను తీసుకొచ్చింది. అదనపు సెలవుల ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో పలువురు ఉద్యోగులు ధూమపానం మానేందుకు ముందుకు వచ్చినట్లు సంస్థ వెల్లడించింది. కొందరు పూర్తిగా స్మోకింగ్‌కు గుడ్‌బై చెప్పగా, మరికొందరు గణనీయంగా తగ్గించినట్లు సమాచారం. ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా, కార్యాలయంలో ఉత్పాదకత కూడా పెరిగిందని కంపెనీ పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు

పియాలా సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటూనే, పనితీరు మెరుగుపడేలా రూపొందించిన ఈ విధానాన్ని పలువురు హెచ్‌ఆర్ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా మంచి మార్పులు తీసుకురావచ్చని ఈ ఉదాహరణ మరోసారి నిరూపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని సంస్థలు కూడా ఇలాంటి విధానాలను అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+