Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేడే లాస్ట్ డేట్: ఈరోజు రాత్రి 12 లోపు ఈ 3 పనులు పూర్తి చేయండి!

నేడు డిసెంబర్ 31, 2025. అంటే ఈ ఏడాదికి చివరి రోజు మాత్రమే కాదు.. ఆర్థికపరమైన అనేక కీలక నిర్ణయాలకు, కీలక పనులను పూర్తి చేయడానికి ఇదే ఆఖరి అవకాశం. పొరపాటున ఈ రోజు పనులు చేయకపోతే రేపటి నుంచి మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ బిజీగా ఉండి కొన్ని పనులను వాయిదా వేస్తూ వస్తే నేటి రాత్రి 12 గంటల లోపు వాటిని పూర్తి చేయడం అత్యవసరం. లేదంటే జనవరి 1, 2026 నుంచి మీరు భారీ జరిమానాలు చెల్లించడమే కాకుండా కొన్ని ఆర్థిక సేవలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రధానంగా మీరు దృష్టి సారించాల్సిన ఆ మూడు కీలక అంశాలు ఇవే..

1. రివైజ్డ్ అండ్ బిలేటెడ్ ఐటీఆర్
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడమనేది ప్రతి పన్ను చెల్లింపుదారుడి బాధ్యత. ఆర్థిక సంవత్సరం 2024-25కు సంబంధించి రిటర్న్స్ దాఖలు చేయడానికి నేడే ఆఖరి అవకాశం.

ఎందుకు పూర్తి చేయాలి?: జులై 31 నాటికి ఐటీఆర్ దాఖలు చేయని వారు ఇప్పుడు 'బిలేటెడ్ రిటర్న్' వేయవచ్చు. ఒకవేళ గతంలోనే వేసినా, అందులో ఏవైనా తప్పులు ఉంటే (ఉదాహరణకు ఆదాయం తక్కువ చూపడం లేదా డిడక్షన్స్ మర్చిపోవడం) వాటిని సరిచేస్తూ 'రివైజ్డ్ రిటర్న్' వేయడానికి ఇదే చివరి రోజు. గడువు దాటితే ఆదాయాన్ని బట్టి రూ.1,000 నుండి రూ.5,000 వరకు పెనాల్టీ పడుతుంది.

ఈ రోజు దాటితే మీరు మీ వ్యాపారంలో లేదా షేర్ మార్కెట్‌లో వచ్చిన నష్టాలను వచ్చే ఏడాది లాభాలతో సర్దుబాటు చేసుకునే వెసులుబాటును కోల్పోతారు. రేపటి నుంచి కేవలం 'అప్‌డేటెడ్ రిటర్న్' (ITR-U) మాత్రమే అందుబాటులో ఉంటుంది, దానికి అదనపు ట్యాక్స్, వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.

Last Date Today Complete These 3 Important Financial Tasks Before Midnight

2. పాన్-ఆధార్ లింకింగ్
పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం ఇప్పుడు తప్పనిసరి. అయితే ఈ డిసెంబర్ 31 గడువు ప్రధానంగా ఓ ప్రత్యేక వర్గం వారికి చాలా ముఖ్యం. గతంలో పాన్ కార్డు తీసుకునే సమయంలో ఆధార్ నంబర్‌కు బదులుగా 'ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ' ఉపయోగించిన వారు, నేటి లోపు ఖచ్చితంగా లింక్ ప్రక్రియ పూర్తి చేయాలి. జనవరి 1 నుంచి మీ పాన్ కార్డు 'ఇన్ఆపరేటివ్' (Inoperative) అవుతుంది. అంటే మీ దగ్గర కార్డు ఉన్నా అది చెల్లదు. పాన్ పనిచేయకపోతే బ్యాంక్ ఖాతా తెరవడం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) చేయడం, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం అసాధ్యం అవుతుంది. అంతేకాకుండా మీ ఆదాయంపై కోత విధించే TDS (Tax Deducted at Source) రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది.

3. చిన్న మొత్తాల పొదుపు పథకాలు
ప్రభుత్వ పొదుపు పథకాలైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) వంటి వాటిలో పెట్టుబడి పెట్టేవారు నేడు ఒక నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ఈ పథకాల వడ్డీ రేట్లను సవరిస్తుంది. ఇటీవల ఆర్బీఐ రెపో రేటును 0.25 శాతం తగ్గించింది. దీని ప్రభావంతో జనవరి 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త త్రైమాసికంలో పోస్టాఫీసు పథకాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ మీరు ఈ ఏడాదికి సంబంధించి ఇంకా పెట్టుబడి పెట్టకపోతే, ప్రస్తుతమున్న అధిక వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని పొందడానికి ఈరోజే ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయడం ఉత్తమం.

ఈ పనులన్నీ మీరు ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేయవచ్చు. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, సాధ్యమైనంత త్వరగా వీటిని పూర్తి చేసి కొత్త ఏడాదిని టెన్షన్ లేకుండా ఆహ్వానించండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+