Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బంగారం ధరలు కుప్పకూలడం ఖాయం- రిస్క్ ఆఫ్ సెంటిమెంట్‌

అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమవడంతో ఈ వారం భారత మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముడి చమురు ధరల పెరుగుదల భయాలు, నిఫ్టీ 24,000 స్థాయి వద్ద ఒడిదుడుకులు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల అప్రమత్తత, చమురు ఆధారిత ద్రవ్యోల్బణ ప్రమాదాలు మార్కెట్‌ను కలవరపరుస్తున్నాయి. దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యే పరిస్థితులు పొంచివున్నాయి.

ప్రమాదం తీవ్రతరం..

ఇస్లామాబాద్ లో జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ఏ మాత్రం పురోగతి కనిపించలేదు. ఈ రెండు దేశాల ప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. చర్చలు విఫలమైన మరుక్షణమే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. దీని ప్రభావం రిస్క్ ఆఫ్ సెంటిమెంట్‌ను తిరిగి రాజేసింది. ఈ వైఫల్యం ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదాన్ని తీవ్రతరం చేసింది. దీని పర్యవసానంగా ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణం, పెట్టుబడిదారుల ప్రవాహంపై ప్రతికూల ప్రభావాలు పడవచ్చు.

Markets Set for Gap-Down Open as US-Iran Talks Collapse and Oil Spike Fears Return Weigh on India

ఒడిదుడుకులు..

దౌత్య చర్చలు విఫలం కావడం స్వల్పకాలిక మార్కెట్ అంచనాలను గణనీయంగా మార్చింది. గత తాత్కాలిక కాల్పుల విరమణతో వచ్చిన ఊరట ఇప్పుడు మళ్లీ ప్రమాదంలో పడింది. అనిశ్చితిని ఎదుర్కొంటోంది. హార్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరాను దెబ్బతీసి, ధరలను మరింత పెంచవచ్చు. గత వారం మార్కెట్లు ఒడిదుడుకులతో కూడిన కదలికలతో స్వల్ప లాభాల్లో ముగిశాయి. కాల్పుల విరమణ తర్వాత నిఫ్టీ 24,000 మార్క్‌ను తిరిగి పొందినా, లాభాల్లో నిలకడ కనిపించలేదు.

అధిక లాభాల స్వీకరణ..

అధిక స్థాయిలలో లాభాల స్వీకరణ, బలహీనమైన ప్రపంచ సంకేతాలు ర్యాలీని నిరోధించాయి. బెంచ్‌మార్క్ సూచీలు భారీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ దారి తీసే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఇటీవల కొనసాగిన లాభాల్లో కొంత భాగాన్ని ఊడ్చివేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ 24,000 స్థాయికి దిగువన పడితే, మార్కెట్ మళ్లీ సెల్ ఆన్-రైజ్ స్ట్రక్చర్‌కి మారే అవకాశం ఉంది. అంటే మార్కెట్ బలహీనపడిందనడానికి నిదర్శనం.

ముడి చమురు..

ఈ వారం ముడి చమురు అత్యంత కీలకమైన అంశం. హార్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు పెరిగితే, చమురు ధరలపై దీని ప్రభావం గణనీయంగా పడుతుంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీస్తుంది. పెరిగిన చమురు ధరలు కార్పొరేట్ మార్జిన్లపై ఒత్తిడిని తీసుకొస్తాయి. రూపాయి బలహీనపడటానికి కారణమౌతాయి. ఫలితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏదైనా విధాన సడలింపును ఆలస్యం చేయవచ్చు. తద్వారా ఆర్థిక పరిస్థితులు కఠినంగా మారే ప్రమాదం ఉంది.

నిఫ్టీ కీలకమైన జోన్‌..

ప్రస్తుతం నిఫ్టీ కీలకమైన జోన్‌ను తాకింది. 24,000 పాయింట్ల స్థాయిలో కొనసాగుతోంది. ఈ స్థాయికి దిగువన నిఫ్టీ కదలిక కొనసాగితే మార్కెట్ మరింత బలహీనపడుతుందని అంచనా. 24,500 అప్ ట్రెండ్ ను అధిగమిస్తేనే బుల్లిష్ మొమెంటం పుంజుకుంటుంది. మొత్తంమీద మార్కెట్ రికవరీ దశ నుండి తీవ్ర ఒత్తిడికి లోను కావొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. స్థిరత్వం ఏర్పడే వరకు మార్కెట్ ప్రతికూల ధోరణితో కొనసాగవచ్చని, ఇన్వెస్టర్లు నిశితంగా ఈ పరిణామాలను గమనించాలని సూచిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+