ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా? రేపటి నుంచి కొత్త రూల్స్
UPI New Rules: మీరు గూగుల్ పే , ఫోన్ పే లేదా పేటీఎం వంటి యూపీఐ యాప్‌లను వినియోగిస్తున్నారా?. రేపటి(ఆగస్టు 1) నుంచి యూపీఐ నిబంధనలలో గణనీయమైన మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులు బ్యాలెన్స్ చెక్ చేయడం, ఆటోపే లావాదేవీలు, లావాదేవీల స్టేటస్ చెక్ చేసుకోవడం వంటి అంశాలను ప్రభావితం చేస్తాయి. ఈ మార్పులన్నీ యూపీఐ వినియోగదారులందరికీ వర్తిస్తాయి. కోట్లాది మంది వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేకుండా డిజిటల్ చెల్లింపుల ప్రయోజనాలను పొందగలిగేలా యూపీఐ అనుభవాన్ని మెరుగుపరచడమే ఈ మార్పుల లక్ష్యం.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఇప్పుడు యూపీఐలో కొన్ని కీలక మార్పులను అమలు చేయబోతోంది. అవి ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి. తద్వారా సర్వర్ అంతరాయాలు, చెల్లింపులలో జాప్యం వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అవేంటో తెలుసుకుందాం.

1.బ్యాలెన్స్ చెక్ చేసే అలవాటుకు పరిమితి
ప్రధాన మార్పు బ్యాలెన్స్ చెక్ చేసే పరిమితికి సంబంధించింది. కొత్త నియమం ప్రకారం, మీరు ఏదైనా ఒక యూపీఐ యాప్ నుంచి ఒక రోజులో గరిష్టంగా 50 సార్లు మాత్రమే మీ ఖాతా బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. చాలా మంది వినియోగదారులు అనవసరంగా తరచుగా బ్యాలెన్స్ చెక్ చేయడం వల్ల సర్వర్లపై ఒత్తిడి పెరిగి, లావాదేవీల వేగం తగ్గుతుందని ఎన్పీసీఐ భావిస్తోంది. ఈ పరిమితి సాధారణ వినియోగదారులకు సరిపోతుంది. సిస్టమ్ పనితీరును మెరుగుపరుస్తుంది.
2. లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలను చూసేందుకు కూడా పరిమితి
ఇకపై మీరు మీ మొబైల్ నంబర్‌కు లింక్ చేయబడిన అన్ని బ్యాంక్ ఖాతాల జాబితాను ఒక రోజులో 25 సార్లు మాత్రమే చూడగలరు. ఈ చర్య కూడా సిస్టమ్‌లో అనవసరమైన ఏపీఐ కాల్స్‌ను తగ్గించడం ద్వారా యూపీఐ సేవను మరింత సున్నితంగా నడిపించడంలో సహాయపడుతుంది.
3. ఆటోపే లావాదేవీలు ఇప్పుడు ప్రత్యేక సమయాల్లో..
మీరు నెట్‌ఫ్లిక్స్, మ్యూచువల్ ఫండ్ సిప్‌లు లేదా ఇతర బిల్లుల చెల్లింపుల కోసం ఆటోపే సౌకర్యాన్ని ఉపయోగిస్తున్నట్లయితే, ఈ మార్పు మీకు ముఖ్యం. ఆటో పేమెంట్స్ ట్రాన్సాక్షన్లకు ఫిక్స్‌డ్ టైం స్లాట్స్ ఉంటాయి. ఇప్పుడు, అటువంటి అన్ని ఆటోపే లావాదేవీలు కేవలం నాన్-పీక్ సమయాల్లో మాత్రమే ప్రాసెస్ చేయబడతాయి. దీని కోసం మూడు టైమ్ స్లాట్‌లు నిర్ణయించబడ్డాయి:
*ఉదయం 10 గంటలకు ముందు
*మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల మధ్య
*రాత్రి 9:30 గంటల తర్వాత
4. ఫెయిల్ అయిన పేమెంట్స్ స్టేటస్‌ను పదేపదే తనిఖీ చేయలేరు..
కొన్ని సార్లు పేమెంట్ ఫెయిల్ అయినప్పుడు మనం పదేపదే దాని స్టేటస్‌ను తనిఖీ చేస్తాం. ఇప్పుడు దీనిపై కూడా పరిమితి విధించబడింది. మీరు విఫలమైన లావాదేవీల స్థితిని రోజుకు మూడు సార్లు మాత్రమే తనిఖీ చేయగలరు. అంతేకాకుండా ప్రతిసారి స్టేటస్ చెక్ చేయడానికి90 సెకన్ల వ్యవధి ఉండటం కూడా అవసరం. ఈ నియమం సర్వర్‌పై లోడ్‌ను తగ్గించడంలో, లావాదేవీల రివర్సల్ లేదా రీట్రై సక్సెస్ రేటును పెంచడంలో సహాయపడుతుంది.
బ్యాంకులు, యాప్‌లకు కఠినమైన ఆదేశాలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ కార్యకలాపాలను నియంత్రించే సంస్థ, అన్ని బ్యాంకులు, చెల్లింపు సేవా ప్రదాతలకు కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాల ముఖ్య ఉద్దేశ్యం అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (API) వినియోగాన్ని పర్యవేక్షించడం, నియంత్రించడం. దీనివల్ల యూపీఐ సిస్టమ్‌లో ఎటువంటి లోపాలు లేదా అంతరాయాలు లేకుండా చూసుకోవచ్చు.ఈ నిబంధనలకు కట్టుబడి ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications